పవన్ కళ్యాణ్ సైన్ చేసిన ప్రాజెక్టుల్లో ‘వినోదయ సీతమ్’ రీమేక్ కూడా ఒకటి. సముద్రఖని దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కనుంది అంటూ గతంలో ప్రచారం జరిగింది. సముద్రఖని కూడా పవన్ తో సినిమా చేస్తున్నట్టు ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్స్ టైంలో రివీల్ చేశాడు. నిజానికి ‘వినోదయ సీతమ్’ తెలుగు వెర్షన్ జీ5 లో అందుబాటులో ఉంది. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడంతో అన్ని వెర్షన్లలో రిలీజ్ చేశారు మేకర్స్.
దీంతో స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.’పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.’ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ బ్యానర్ పై త్రివిక్రమ్ కూడా సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు అని వినికిడి.ఈ సినిమాలో పవన్ కు హీరోయిన్ ఉండదు. సాయి ధరమ్ తేజ్ పాత్రకు మాత్రమే హీరోయిన్ అవసరం. కాబట్టి.. కేతిక శర్మని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ‘భీమ్లా నాయక్’ బ్యూటీ సంయుక్త మేనన్ ను ఫైనల్ చేసినట్లు టాక్ నడిచింది.
సైలెంట్ గా పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. కానీ.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ల వల్ల ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ఇక ఈ ప్రాజెక్టు ఉండదు అనే ప్రచారం కూడా ఓ రేంజ్లో జరిగింది.దానికి తోడు పవన్ కళ్యాణ్.. ‘హరి హర వీర మల్లు’ తో పాటు హరీష్ శంకర్, సుజీత్ వంటి దర్శకులతో కూడా సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించడంతో.. ఇక పవన్ – సాయి ధరమ్ తేజ్ ప్రాజెక్టు లైట్ అని అంతా ఫిక్స్ అయిపోయారు.
అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం.. 2023 సంక్రాంతి ముగిసిన వెంటనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 18 రోజులు డేట్స్ ఇస్తే సరిపోతుందట. కాబట్టి 2023 లో పవన్ కళ్యాణ్ నుండి రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అంటే పవన్ ఫ్యాన్స్ కి డబుల్ ఫీస్ట్ అన్న మాట.