జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని సంచలన ప్రకటన చేసి వార్తల్లో నిలిచారు. ఈరోజు రాజమండ్రి జైలులో చంద్రబాబు నాయుడును కలిసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే పొత్తు విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నానని పవన్ అన్నారు. ఏపీ భవిష్యత్తు బాగుండాలనే నా ఆకాంక్ష అని రాళ్లు వేసిన ఎవరినీ వదిలిపెట్టనని పవన్ కళ్యాణ్ తెలిపారు.
వైసీపీ నేతలు మాపై రాళ్లు వేసేముందు ఆలోచించుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీకి తప్పులు సరిదిద్దుకోవడానికి ఆరు నెలల సమయం మాత్రమే ఉందని పవన్ వెల్లడించారు. యుద్ధమే కావాలంటే యుద్ధానికి సిద్ధమేనని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పోలీస్ వ్యవస్థ ఇంత బానిసత్వంగా ఉంటే ఎవరూ ఏం చేయలేరని పవన్ తెలిపారు. చట్టాలను అధిగమించి పని చేసే అధికారులు ఆలోచించుకోవాలని పవన్ కామెంట్లు చేశారు.
బీజేపీ కూడా మాతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ఏపీ దుస్థితి గురించి మోదీ, అమిత్ షా, గవర్నర్ కు తెలియజేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక, మైనింగ్, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఎవరినీ వదిలిపెట్టనని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు భద్రత విషయాన్ని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని విభేదించాను తప్ప వ్యక్తిగతంగా కాదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. విధాన నిర్ణయాల్లో మా నిర్ణయాలు వేరు కావచ్చని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో అభివృద్ధి, ఉద్యోగాల కల్పన ఎక్కడుందని పవన్ ప్రశ్నించారు. పవన్ (Pawan Kalyan) వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.