Pawan Kalyan, Mahesh Babu: టాలీవుడ్ జనాలకు పవన్‌ పంపిన విషెష్‌ చూశారా!

హీరోలను చూసి స్టైల్‌ నేర్చుకుంటారు, డ్రెస్సింగ్‌ అలవాటు చేసుకుంటారు, బైక్‌లు కొంటారు. ఇన్ని చేసినా… ఒక్క పని మాత్రం చేయరు. అదే స్నేహం. అన్ని ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి ఉంది కానీ… మన టాలీవుడ్‌లో ఈ సయోధ్య తక్కువగా ఉంటుంది అనొచ్చు. తొలుత సినిమా విడుదల సమయాల్లో స్నేహితుల గ్రూపులో వచ్చేవి ఫ్యాన్స్‌ కొట్లాటలు. ఆ తర్వాత ఎప్పుడైతే సోషల్‌ మీడియాలో ఎంటర్‌ అయ్యిందో. మొత్తం నాశనం చేశారు ఫ్యాన్స్‌ ముసుగులో ఉన్న ట్రోలర్లు.

పోస్టర్‌, టీజర్‌, ట్రైలర్‌, టైటిల్‌, పాట, సినిమా… ఇలా ఏది విడుదలైనా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లు మొదలవుతాయి. వాటిలో ఈ హీరో, ఆ హీరో అని లేదు. అందరి హీరోల తరఫున ‘ఫ్యాన్స్‌’ అంటూ కొందరు ముందుకొస్తారు. అవతలి హీరోను మాటలతో ఇరిటేట్‌ చేస్తారు. ఆ హీరోలు స్పందించకపోయినా… వాళ్ల ఫ్యాన్స్‌ వాదనకొస్తారు. అయితే వాళ్లు మరచిపోయేది ఒక విషయం ఉంది. తాము గొడవపడుతున్న ఫ్యాన్స్‌ (?)కి చెందిన హీరో, తమ హీరో ఫ్రెండ్సే అని.

దీపావళి సందర్భంగా టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే జరిగింది. దీపాల పండగ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ ఇండస్ట్రీలోని తన స్నేహితులకు విషెష్‌, స్వీట్స్‌, పటాకులు పంపించారు. వాటికి సంబంధించిన ఫొటోలను ఆయా వ్యక్తులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అందులో నమత్ర శిరోద్కర్‌ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ‘థ్యాంక్యూ అన్నా, పవన్‌’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఆ ఫొటో పెట్టారు. సో ఫ్యాన్స్‌ కాని ఫ్యాన్స్‌ ఇకనైనా మారండి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus