పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు. పవన్ డిమాండ్ చేస్తే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ దగ్గర అప్పు చేశానని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా పవన్ కళ్యాణ్ గతంలో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరుత సినిమాతో రామ్ చరణ్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారనే సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి, చరణ్, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ తాను సినిమాల్లో హీరో అయిన తర్వాత వదినను డబ్బులు అడిగే పరిస్థితి లేదని ఒకవేళ డబ్బులు అడిగితే హీరో అయిపోయావు కదా ఇంకేంటి డబ్బులు అని వదిన అనుకుంటుందని భావించానని పవన్ అన్నారు. ఆ తర్వాత చరణ్ దగ్గర ఉన్న డబ్బులు తీసుకునేవాడినని నాకు చాలా సినిమాలు వస్తాయని వడ్డీతో పాటు డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి
చరణ్ పాకెట్ మనీని తీసుకున్నానని పవన్ వెల్లడించారు. వడ్డీ ఇస్తారు కదా అని వెంటనే ఇచ్చేవాడినని చరణ్ వెల్లడించారు. అయితే చరణ్ దగ్గర తీసుకున్న అప్పును ఇంకా తీర్చలేదని పవన్ కళ్యాణ్ సరదాగా చెప్పుకొచ్చారు. పవన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు వచ్చే నెల చివరి వారం నుంచి పవన్ హరిహర వీరమల్లు మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం. దాదాపుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏఎం రత్నం ఈ సినిమాకు నిర్మాత కాగా దర్శకుడిగా క్రిష్ కెరీర్ కు ఈ సినిమా కీలకమనే సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రిష్ కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.