Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ట్విట్టర్ కు దూరమైనట్టేనా?
- August 24, 2021 / 05:23 PM ISTByFilmy Focus
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొనాలని పవన్ భావిస్తున్నారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో పవన్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ ను మాత్రం అస్సలు వినియోగించడం లేదు.
పవన్ వ్యక్తిగత ఖాతాకు బ్లూ టిక్ ఉండటంతో పాటు 4.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. పవన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ ఏడాది జనవరి నెల 12వ తేదీన వివేకానంద జయంతి సందర్భంగా పోస్టులు పెట్టగా ఆ తర్వాత మార్చి 29వ తేదీన జనసేన పార్టీ తిరుపతి పార్లమెంట్ కాన్ఫరెన్స్ కు సంబంధించిన ట్వీట్ ను రీట్వీట్ చేశారు. జనసేన ట్విట్టర్ ఖాతా నుంచే చిరంజీవి పుట్టినరోజు వేడుకల శుభాకాంక్షలకు సంబంధించిన ప్రెస్ నోట్ వచ్చింది.

దాదాపు ఐదు నెలల నుంచి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ కు దూరంగా ఉండటంతో పవన్ ట్విట్టర్ కు దూరమైనట్టేనా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్ ప్రజా జీవితంలోకి రావడం వల్లే జనసేన ఖాతాను ఎక్కువగా వినియోగిస్తున్నారని ఆ ఖాతాకు ఫాలోవర్స్ సంఖ్యను పెంచేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పవన్ పర్సనల్ ఖాతాను వినియోగిస్తారో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

















