Pawan Kalyan: ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ స్టార్ట్‌ చేసేస్తారా?

పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా ఏంటి? ఎప్పుడు మొదలవుతుంది? ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్లే వచ్చి.. తర్వాత మళ్లీ పోయింది. అదేంటి మొన్నీమధ్యే రెండు సినిమాలు ప్రకటించారు, ఒకటి ముహూర్తం కూడా జరుపుకుంది అనుకుంటున్నారా? అవును మీరు అన్నది నిజమే.. అయితే ఏ సినిమా ముందు మొదలవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు అంటున్నారు. దీనికి కారణం ‘లేదు’ అనుకుంటున్న ఓ సినిమా సంక్రాంతి తర్వాత మొదలవుతుంది అనే పుకారు వార్తగా రావడమే.

సుజీత్‌తో ‘OG’, హరీశ్‌ శంకర్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాలను ఇటీవల అనౌన్స్‌ చేశారు. ‘ఉస్తాద్‌..’ ముహూర్తం కూడా జరిగిపోయింది. అయితే ఈ రెండు సినిమాలకు ముందు ‘వినోదాయ చిత్తాం’ అనే సినిమాను పవన్‌ చేస్తాడని వార్తలొచ్చాయి. దీంతో ముందు అనుకున్న సినిమాలు కన్నా.. రీమేక్‌ మీదే పవన్‌ మక్కువ చూపిస్తున్నారు అని అనుకున్నారు. కానీ ఆ సినిమా అనౌన్స్‌ కాకపోవడంతో కొంతమంది అభిమానులు హమ్మయ్య అనుకున్నారు. అయితే వాళ్లు ఆ మాటను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది అని టాక్.

ఎందుకంటే ‘వినోదాయ చిత్తాం’ సినిమా రీమేక్‌ను జనవరి ద్వితీయార్ధంలో స్టార్ట్‌ చేయాలని టీమ్‌ అనుకుంటోందట. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను మాతృక దర్శకుడు సముద్రఖనినే తెరకెక్కిస్తారట. అయితే ఈ సినిమాలో పవన్‌ పాత్రలో ఎలాంటి పొడిగింపు ఉండదట. దీంతో తక్కువ సమయంలో షూట్‌ పూర్తి చేసేలా ప్రయత్నాలు సాగుతున్నాయట. తొలుత సాయితేజ్‌తో సన్నివేశాలు స్టార్ట్‌ చేసి.. ఆఖరున పవన్‌ సీన్స్‌ తీయాలని అనుకుంటున్నారట. అయితే ఈ విషయాలు ఏవీ బయటకు రాకుండా ప్లాన్‌ చేస్తున్నారని వినికిడి.

దీనికి కారణం ఈ సినిమా విషయంలో పవన్‌ ఫ్యాన్స్‌ అంత హ్యాపీగా లేకపోవడమే. ఆ రీమేక్‌లో పవన్‌ లాంటి మాస్‌ హీరోకు అంత స్కోప్‌ లేదని చెబుతున్నారు. తమిళంలో సముద్రఖని నటించిన ఆ పాత్రను, సినిమాను చూసి అభిమానులు ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చేశారు. అదే విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా చెబుతున్నారు కూడా. కానీ పవన్‌ ఆ సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్‌ అయ్యాడు అంటున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus