కొన్ని సినిమాలు వచ్చి ఎన్నేళ్లు అయినా ఫ్యాన్స్ మనసులో చిరస్థాయిలో నిలిచిపోతుంటాయి. అలాంటి సినిమాలు ఎన్ని ఎక్కువ ఉంటే ఆ హీరోకు, ఆయన ఫ్యాన్స్‌కు అంత ఆనందం. అచ్చంగా అలాంటి సినిమానే ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) . పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) , ఆయన ఫ్యాన్స్‌కు ఈ సినిమా చాలా స్పెషల్. అందుకే పవన్ స్పెషల్ డే అయిన సెప్టెంబరు 2న రీరిలీజ్ చేశారు. అయితే విజయవాడలో వరద కారణంగా అక్కడ ఎవరూ అంత ఉత్సాహంగా లేరు.
Gabbar Singh
కానీ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో రీరిలీజ్ మేనియా మామూలుగా లేదు అని చెప్పాలి. టాలీవుడ్‌లో గత రెండేళ్లలో ఎన్నో రీ రిలీజ్‌లు చూసుంటారు. కానీ ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్(Gabbar Singh Re-Release) వాటికి మించి అనేలా అభిమానులు థియేటర్లలో ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ సంధ్య థియేటర్లో సీన్స్ చూస్తే పవన్ ఫ్యాన్స్ కడుపు నిండిపోయి ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
‘జల్సా’ (Jalsa) సినిమా సమయంలో థియేటర్లలో జరిగిన హంగామా గుర్తుందా? సినిమాలో పాటలు వచ్చినపుడల్లా థియేటర్‌లో ఉన్న ప్రతి ఫ్యాన్ కోరస్ పాడుతూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ‘గబ్బర్ సింగ్’ సినిమాకూ అలాంటి పరిస్థితే కనిపించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ మారాయి. 1000 కెపాసిటీ ఉన్న థియేటర్లలో డబుల్, ట్రిపుల్ జనాలు సినిమా చూశారు అని అంటున్నారు.
కెపాసిటీని మించిన జనాలను థియేటర్లలోకి ఎలా వచ్చారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నా.. మరోవైపు ఆ సందడి మాత్రం ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసింది. పేపర్లను విసురుతూ డైలాగ్స్ నుండి చిన్న ఎక్స్‌ప్రెషన్ వరకు అంతా ఎంజాయ్ చేశారు. ఇదంతా చూసి మేనియా అంటే ఇదీ.. అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ఇబ్బందులు లేకుండా ఇలాంటి మరిన్ని వీడియోలు, సందళ్లు చూసేవాళ్లం అని అభిమానులు అంటున్నారు.