“సర్దార్ గబ్బర్ సింగ్” విడుదలకు ముందు పవన్ కళ్యాణ్ హీరోగా ఏ.ఎం.రత్నం నిర్మాణ సారధ్యంలో “జిల్లా” ఫేమ్ ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో తమిళంలో ఘన విజయం సొంతం చేసుకొన్న “వేదాలమ్”ను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నద్ధమై.. చిత్ర ప్రారంభోత్సవాన్ని లాంఛనంగా హైద్రాబాద్ లోని ఫిలిమ్ నగర్ దేవస్థానంలో మొదలెట్టిన విషయం అందరికీ తెలిసిందే. తమిళనాట సంచలనాలు సృష్టించిన ఈ చిత్రం తెలుగులో అదే స్థాయి విజయం సాధించడం ఖాయమని పవన్ అభిమానులందరూ సంతోషంలో మునిగితేలారు.
కట్ చేస్తే.. “సర్దార్ గబ్బర్ సింగ్” డిజాస్టర్ అవ్వడంతో, వెంటనే ఒక హిట్ కంపల్సరీ కావడంతో.. “వేదాలమ్” రీమేక్ ను పక్కనపెట్టి త్రివిక్రమ్ సినిమా మొదలెట్టాడు. దాంతో.. “వేదాలమ్” రీమేక్ ఆగిపోయినట్లేనని చాలామంది ఫిక్సయిపోయారు. కానీ.. సినిమా ఆగిపోలేదని, స్క్రిప్ట్ వర్క్ తోపాటు ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపుగా పూర్తయ్యిందని, జనవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టేందుకు రంగం సిద్ధమవుతోందని నిర్మాత ఏ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ కన్ఫర్మ్ చేశాడు. “ఆక్సిజన్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన జ్యోతికృష్ణ ఈ విషయాన్ని వెల్లడించడంతో.. అభిమానుల్లో ఒక్కసారిగా ఆనందం పెల్లుబికింది.