సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా సిరుతై శివ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘పెద్దన్న’. కుష్బూ, మీనా వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కాబోతుంది. టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో సినిమా పై హైప్ ఏర్పడింది. అలాగే అవి విడుదల కావడానికి ముందే ఈ చిత్రానికి తెలుగులో మంచి బిజినెస్ జరిగింది. పాండమిక్ టైములో విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమాల్లో అత్యధిక బిజినెస్ జరిగింది ‘పెద్దన్న’ సినిమాకే కావడం విశేషం.
ఒకసారి ఆ వివరాలను గమనిస్తే :
నైజాం
4.00 cr
సీడెడ్
2.20 cr
ఉత్తరాంధ్ర
1.45 cr
ఈస్ట్
1.00 cr
వెస్ట్
0.82 cr
గుంటూరు
1.10 cr
కృష్ణా
0.98 cr
నెల్లూరు
0.65 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
12.20 cr
‘పెద్దన్న’ చిత్రానికి రూ.12.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.12.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.తెలుగులో రజినీ కాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫోలోయింగ్ రేంజ్ అంత టార్గెట్ ఏమీ కాదు ఇది. కాకపోతే ‘కాలా’ దగ్గర నుండీ రజినీ సినిమాలు ఇక్కడ పెద్దగా కలెక్ట్ చేయడం లేదు. పైగా ‘మంచి రోజులొచ్చాయి’ ‘ఎనిమి’ వంటి చిత్రాలు పోటీగా ఉన్నాయి. మరి ఫుల్ రన్లో ‘పెద్దన్న’ ఇక్కడ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.