ప్రేమ్ రక్షిత్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్, ఇది మన అందరికి తెలిసిన విషయమే. తాను మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్నాడు అని టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. అయితే అది ఎవరితోనో కాదు మన డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తోనే అంట. పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ తో, ఇప్పటివరకు ఒక మూవీ కూడా డైరెక్ట్ చేయని ప్రేమ్ రక్షిత్ కి ఛాన్స్ ఎలా ఇచ్చాడు అనేదే ఇక్కడ పెద్ద సస్పెన్స్.
Prabhas, Prem Rakshith
ప్రస్తుతానికి మారుతీ డైరెక్షన్లో , మాళవిక మోహన్ , నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా , ప్రభాస్ హీరోగా “రాజాసాబ్” చిత్రం మొన్న ఈ మధ్యనే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే రాజాసాబ్ షూటింగ్ జరుగుతున్నప్పుడే కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తను రెడీ చేసుకున్న కథను ప్రభాస్ కు నారేట్ చేసారంట. కథ ప్రభాస్ కి నచ్చటంతో, ప్రేమ్ రక్షిత్ కి కన్ఫర్మేషన్ ఇచ్చిన్నట్టు ఒక వార్త ఆన్లైన్ లో హాల్ చల్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఎంత వరకు ముందుకు వెళ్తుందో చూడాలి మరి….!
2022 లో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “RRR” మూవీ లో నాటు నాటు సాంగ్ కి గాను గ్లోబల్ గా పలు ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ “ఆస్కార్ అవార్డు” గెలుచుకోవటంతో వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమాకు గర్వించదగ్గ విషయం. ఆ పాటకు కొరియోగ్రాఫర్ మన ప్రేమ్ రక్షిత్ మాస్టారే.