రజినీకాంత్ హీరో, కమల్ హాసన్ నిర్మాత.. ‘తలైవర్ 173’ అనౌన్స్‌మెంట్‌తో కోలీవుడ్‌లో హైప్ పీక్స్‌కు వెళ్లింది. ఇద్దరు దిగ్గజాలు కలవడంతో ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ, ఈ ప్రాజెక్ట్‌ను నడిపించే ‘దర్శకుడు’ ఎవరనేదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్‌గా మారింది. ఒకరి తర్వాత మరొకరు తప్పుకోవడంతో కోలీవుడ్‌లో కలకలం రేగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకుడిని ఫైనల్ చేయడం కమల్ హాసన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
మొదట లోకేష్ కనగరాజ్ పేరు వినిపించినా, ‘కూలీ’ ఫ్లాప్ ఎఫెక్ట్‌తో ఆయన సైడ్ అయ్యారని టాక్. ఆ తర్వాత, సీనియర్ డైరెక్టర్ సుందర్ సి.ని అధికారికంగా ప్రకటించారు. కానీ, ఇప్పుడు “అనుకోని పరిస్థితుల వల్ల” తానీ అవకాశం వదులుకుంటున్నట్లు సుందర్ సి. కూడా హ్యాండ్ ఇవ్వడం షాకింగ్‌గా మారింది.
Rajinikanth
ఇప్పుడు ఈ లెజెండరీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సీటు మళ్లీ ఖాళీ అయింది. దీంతో, నెటిజన్లు కొత్తగా కార్తీక్ సుబ్బరాజ్ పేరును తెరపైకి తెస్తున్నారు. ‘పేట’ సినిమాతో రజినీకాంత్‌ను ఫ్యాన్స్‌కు నచ్చేలా చూపించినా, ఆ సినిమా ఆశించినంత పెద్ద హిట్ కాలేదు. పైగా ‘పిజ్జా’, ‘జిగర్తాండ’ తర్వాత కార్తీక్ కూడా ఆ స్థాయి హిట్ చూడలేదు. ఇటీవల వచ్చిన ‘రెట్రో’ కూడా క్లిక్ కాలేదు.
ఇలా ఫామ్‌లో లేని డైరెక్టర్‌ను ఫ్యాన్స్ సూచించడం ఆశ్చర్యంగా ఉంది. మరోవైపు, ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్న ప్రెషర్ కూడా మామూలుగా లేదు. ‘కూలీ’ ఫ్లాప్ తర్వాత లోకేష్ తప్పుకోవడం, ఇప్పుడు సుందర్ సి. కూడా తప్పుకోవడంతో.. ఇద్దరు లెజెండ్స్‌ను బ్యాలెన్స్ చేయడం కత్తి మీద సాములా మారిందని అర్థమవుతోంది. సుందర్ సి. లాంటి సీనియర్ డైరెక్టరే ఒత్తిడిని తట్టుకోలేక తప్పుకున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి.
ఇప్పుడు ఫ్యాన్స్ కోరుతున్నట్లు ఫామ్‌లో లేని కార్తీక్ సుబ్బరాజ్‌కు తలైవా మరో ఛాన్స్ ఇస్తారా? లేక ఈ ప్రాజెక్ట్ కోసం మరో పెద్ద డైరెక్టర్‌ను వెతుకుతారా? లేదా ఈ ఒత్తిడి చూసి ఈ ప్రాజెక్ట్‌నే పక్కన పెడతారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ గందరగోళం చూస్తుంటే, ఈ లెజెండరీ కాంబో పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది.