టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరని ప్రభాస్ అభిమానులలో కొంతమంది ఫ్యాన్స్ ఫీలవుతారనే సంగతి తెలిసిందే. పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న ప్రభాస్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటే ఆయన కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. అయితే స్నేహితుల ఒత్తిడితో ప్రభాస్ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ప్రభాస్ ట్విట్టర్ లో పోస్ట్ ల ద్వారా సందడి చేయనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో ఖాతాలను కలిగి ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ట్విట్టర్ లో ఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. ట్విట్టర్ లో జాయిన్ అవుతానని ప్రభాస్ తన స్నేహితులకు మాట ఇచ్చారని తెలుస్తోంది. ప్రభాస్ ట్విట్టర్ లో ఎంట్రీ ఇస్తే కొన్నిరోజుల్లోనే ఆయన ఖాతాను ఫాలో అయ్యే ఫాలోవర్ల సంఖ్య ఊహించని రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు.
ప్రభాస్ ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తరచూ కొత్త ఫోటోలను షేర్ చేయడంతో పాటు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు ప్రభాస్ గత సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచినా తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే. సలార్ సినిమాతో ప్రభాస్ రికార్డులను క్రియేట్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ రెమ్యునరేషన్ 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజయ్యేలా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ సాధిస్తే ఆయన రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని ఇండస్ట్రీ వర్గాల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.