ప్రభాస్ (Prabhas) ,దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ..ల కలయికలో రూపొందిన ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) సినిమాలో కర్ణుడుని ‘అర్జునుడి కంటే గొప్పగా చూపించడం అనేది నాకు నచ్చలేదు. ఓ సినిమా వాడిగా నేను సిగ్గు పడుతున్నాను, బాధతో ఈ మాటలు మాట్లాడుతున్నాను’ అంటూ గేయ రచయిత అనంత శ్రీరామ్ (Anantha Sriram) ఇటీవల పలికిన సంగతి తెలిసిందే. దీనిపై కొంతమంది సనాతన వాదులు, హిందుత్వం కోసం పోరాడే పెద్దలు.. హర్షం వ్యక్తం చేసి అనంత్ శ్రీరామ్ ని (Anantha Sriram) మెచ్చుకున్నా.. సినిమా వాళ్ళు, నెటిజన్లు మాత్రం అతన్ని తిట్టిపోస్తున్నారు.
Anantha Sriram
ఒక ‘సినిమా వాడివై ఉండి.. ఫిలిం మేకర్స్ ను తక్కువ చేసి మాట్లాడటాన్ని’ ఎవ్వరూ ప్రోత్సహించడం లేదు. ఇదే క్రమంలో కొంతమంది ప్రభాస్ అభిమానులు అనంత్ శ్రీరామ్ ని ట్రోల్ చేస్తూ.. గతంలో అతను రాసిన పాటల్లో సాహిత్యం ఎలా ఉందో గుర్తు చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్లో ‘యమదొంగ’ (Yamadonga) అనే సినిమా వచ్చింది. అందులో ”యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో కుర్ర యమా కుర్ర యమా కుమ్మేసుకో తుమ్మెదెలే అమృతమే జుర్రేసుకో యమ పోటుగా కోటనే దున్నేసుకో….” అంటూ ఘాటైన లిరిక్స్ ఉంటాయి.
యముడి గురించి కూడా పురాణాల్లో గొప్పగానే చెప్పారు. మరి యమలోకాన్ని, యముడిని కించపరుస్తూ అలాంటి హేయమైన లిరిక్స్ రాయడమేంటి? అంటూ కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అనంత్ శ్రీరామ్ ని ప్రశ్నిస్తూ విమర్శిస్తున్నారు. సినిమాని సినిమాగా చూడాలి. ‘అశ్వద్దాముడు, కర్ణుడు.. ధర్మం వైపు నిలబడితే ఎలా ఉంటుందో ‘కల్కి 2898 ad ‘ లో చూపించాలని అనుకుంటున్నట్టు’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.
అది భక్తి సినిమా కూడా కాదు. ఒక ఫిక్షనల్ డ్రామా అని ముందే చెప్పారు. అయినా రిలీజ్ టైంలో కొంతమంది ఈ విషయమై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ అనంత శ్రీరామ్ మాదిరి ఎవ్వరూ కూడా ఇలా ఇష్టమొచ్చినట్టు మీడియా ముందుకు వెళ్ళలేదు. ‘సినిమాని సినిమాగా చూడటం’ అనే విషయాన్ని సినిమా వాళ్ళు కూడా మర్చిపోయారు’ అని జనాలు అనుకోవడానికి కాకపోతే ఎందుకు ఇవన్నీ చెప్పండి..!