Prabhas: ఆదిపురుష్ డేట్ విషయంలో ఫ్యాన్స్ హ్యాపీగా లేరా?

ప్రభాస్ సినీ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఇప్పటికే పలు రిలీజ్ డేట్లను మార్చుకుని వచ్చే ఏడాది జూన్ 16వ తేదీన థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఆదిపురుష్ ఆ సమయానికి రిలీజ్ కావడం ఫ్యాన్స్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. పెద్ద సినిమాలకు సరైన సీజన్ ఏదనే ప్రశ్నకు సంక్రాంతి, సమ్మర్, దసరా అనే సమాధానం వినిపిస్తుంది.

అయితే ఆదిపురుష్ మాత్రం రిలీజ్ డేట్ గా జూన్ 16ను ఎంచుకుంది. తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్, కాలేజ్ లు తెరిచే సమయంలో పెద్ద సినిమాను రిలీజ్ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. జూన్ నెలలో విడుదలై భారీగా కలెక్షన్లను సాధించిన సినిమాల సంఖ్య కూడా తక్కువేననే సంగతి తెలిసిందే. ఈ కామెంట్ల విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది. ఆదిపురుష్ మేకర్స్ తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో ఫ్యాన్స్ ఏ మాత్రం సంతోషంగా లేరు.

ప్రభాస్ సైతం తన సినిమాల రిలీజ్ డేట్స్, ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సాహో, రాధేశ్యామ్ ఫలితాల నేపథ్యంలో సినిమాల ఎంపికలో, కథల ఎంపికలో ప్రభాస్ జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

అయితే ఆ సినిమాలు సరైన డేట్ కు రిలీజ్ కాకపోవడంతో అటు బయ్యర్లు, ఇటు ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. బాహుబలి2 తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. ప్రభాస్ కెరీర్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ప్రభాస్ సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus