రాజమౌళితో సినిమా చేసిన హీరోకి.. ఆ తర్వాత ఓ భారీ ప్లాప్ పడటం ఆనవాయితీగా వస్తోంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ కూడా అందుకు మినహాయింపు కాదు. కానీ ఆ సినిమా హిందీలో బాగా ఆడింది. అంతే కాకుండా ‘బాహుబలి’ కి ముందు ప్రభాస్ మార్కెట్ రూ.40 కోట్లు ఉంటే.. ఆ తర్వాత పది రెట్లు పెరిగింది. అంటే రూ.300 కోట్లన్న మాట. ఈ విషయాన్ని మాత్రం ‘సాహో’ ప్రూవ్ చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘రాధే శ్యామ్’ డిజాస్టర్ అవ్వడంతో ప్రభాస్ ను లాటరీ స్టార్ అనే వారి సంఖ్య కూడా పెరిగింది.
కేవలం రాజమౌళితో సినిమా చేయడం వల్లే ప్రభాస్ ఇమేజ్ పెరిగింది తప్ప.. ఇంకేమీ లేదు అనేవారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. అలాంటి వారికి తాజాగా రిలీజ్ అయిన ‘ఆదిపురుష్’ చిత్రం పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. నిన్న అంటే జూన్ 16 న ‘ఆదిపురుష్’ రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. రామాయణం గురించి పూర్తిగా తమకే తెలుసు అన్నట్టు రివ్యూయర్లు, మీమర్స్, ట్రోలర్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు.
కానీ కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది ‘ఆదిపురుష్’. తొలి రోజు ఈ చిత్రం ఏకంగా రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. అవును.. ఓ ఇండియన్ హీరో వరుసగా మూడు సార్లు.. తన సినిమాలతో మొదటి రోజే రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం ఇదే మొదటిసారి.ఏ స్టార్ హీరోకి అయినా మొదటి రోజు ఈ రేంజ్ కలెక్షన్స్ మామూలే అనుకుందామంటే… రెండో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి.
సో ప్రభాస్ ను (Prabhas) లాటరీ స్టార్ అంటూ కామెంట్లు చేసే బ్యాచ్.. ఇప్పుడేమంటారో? ఇక ‘సలార్’ కూడా సక్సెస్ అయితే ప్రభాస్ ను ఇక ఎవ్వరూ టచ్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. ఆ తర్వాత వచ్చే ‘ప్రాజెక్ట్ కె’ కూడా మినిమమ్ గ్యారంటీ ప్రాజెక్ట్ అనిపించుకునే ఛాన్స్ ఉంది.