Prabhas : 2026 సంక్రాంతి బరిలో మొదటిగా పోటీకి సిద్దమవుతున్న చిత్రం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’. ఈ చిత్రానికి తెలుగు డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం లో హీరోయిన్లుగా అందాల భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిధి ముగ్గురు నటిస్తున్నారు. విశ్వప్రసాద్ నిర్మాతగా ఈ మూవీని నిర్మించారు. జనవరి 9న అందరికంటే ముందుగా విడుదలకు కావాల్సిన సన్నాహాలు అన్ని సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఇది ఇలా ఉండగా, ప్రభాస్ వరుస సినిమా షూటింగ్లతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కల్కి 2 కి సంబంధించి ఒక వార్త ట్రేండింగ్ లో ఉంది. అదేంటో చూద్దాం…

‘రాజాసాబ్’ రిలీజ్ తరువాత ఫిబ్రవరిలో రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తన చిత్రమైన ‘కల్కి 2’ మూవీ షూటింగ్లో బిజీ అవ్వనున్నట్లు సినీ వర్గాల నుంచి వినపడుతున్న టాక్. ఈ మధ్యనే నిర్మాత స్వప్న కూడా దీనిపై మాట్లాడారు కూడా. ఇప్పటికే ప్రభాస్ , హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ మరియు సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ‘స్పిరిట్’ చిత్రాల షూటింగ్లలో ఉన్నారు. దీంతో ప్రభాస్ అభిమానులకు ఇంకో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అంట స్పిరిట్ మూవీ యూనిట్. కొత్త సంవత్సరం కానుకగా ‘స్పిరిట్’ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్తతో అభిమానులు ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
