ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి 400 కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న ఏకైక హీరో ప్రభాస్ అనే సంగతి తెలిసిందే. ఈ స్టార్ హీరో ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. బాహుబలి సిరీస్ సక్సెస్ తర్వాత పలు యాడ్స్ లో కూడా ప్రభాస్ మెరిశారు. టాలీవుడ్ ఇండస్ట్రీతో సమానంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ కు గుర్తింపు ఉంది. బాలీవుడ్ లో ప్రభాస్ సినిమాలకు అంచనాలకు మించి బిజినెస్ జరుగుతోంది.
అయితే ప్రభాస్ మాత్రం యాడ్స్ లో వరుసగా ఆఫర్లు ఇస్తున్నా వాటికి ఓకే చెప్పడం లేదు. ప్రభాస్ అంగీకరిస్తే యాడ్స్ లో నటించడానికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రముఖ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి ఆఫర్లు వస్తే చాలామంది హీరోలు నో చెప్పడానికి ఇష్టపడరు. అయితే ప్రభాస్ మాత్రం పరిమితంగా యాడ్స్ లో నటిస్తున్నారు. సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నారు. క్రేజ్ ఉన్నా ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ప్రభాస్ ఇష్టపడటం లేదు.
సాధారణంగా యాడ్స్ షూటింగ్ అంటే రెండు మూడు రోజుల్లోనే షూట్ పూర్తి కావడంతో పాటు తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తం సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ యాడ్స్ లో నటిస్తే చూడాలని ఉందని కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ రిలీజ్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాతే రాధేశ్యామ్ రిలీజ్ కానుంది.
మార్చి తర్వాత తెలుగు రాష్ట్రాలలో సాధారణ పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్లు బాగానే వస్తున్నా మేకర్స్ మాత్రం ఆ ఆఫర్లకు అంగీకరించకపోవడం గమనార్హం. క్లాస్ మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ కోసం నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.