టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడు లేని విధంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అతిపెద్ద సినిమాలు విడుదల కావాల్సిన సమయంలోనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవో కన్ఫ్యూజన్ లో పడేసింది. ఓ వైపు కరోనా భయంతో జనాలు థియేటర్ కు వస్తారా రారా ? అని అనుకున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం హఠాత్తుగా టికెట్ల రేట్లను తగ్గించడం మరొక పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
మల్టీప్లెక్స్ థియేటర్ టికెట్స్ రేట్లు కూడా దారుణంగా తగ్గించారని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రేట్లతో థియేటర్స్ ను నడపలేము అని కొందరు క్లోజ్ చేసేస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభావం వలన ఇక రెండేళ్ల క్రితం ప్రపంచంలోనే లార్జెస్ట్ స్క్రీన్స్ లలో ఒకటైన థియేటర్ కూడా మూత పడింది. ప్రభాస్ కూడా పాట్నర్ గా ఉన్న నెల్లూరు లోని సూళ్లూర్ పేట V ఎపిక్ థియేటర్ క్లోజ్ అని బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ప్రభాస్ మిత్రుడు వంశీ కృష్ణ రెడ్డి పేరు మీద ఉన్న ఈ థియేటర్ ను 2019లో రామ్ చరణ్ చేతుల మీదుగా స్టార్ట్ చేశారు. అయితే టికెట్ రేట్లు మరీ దారుణంగా 30 రూపాయలు ఉండడంతో యాజమాన్యం కనీస మెయింటైనెన్స్ కూడా చేయలేము అని థియేటర్ ను క్లోజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఇండియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ కలిగిన వి ఎపిక్ థియేటర్ ను మూసివేయడంతో ప్రభాస్ తో టీమ్ సభ్యులు కూడా అప్సెట్ అయినట్లు సమాచారం. ఇక మల్టీప్లెక్స్ థియేటర్ మీద ఆధారపడి 50కి పైగా కుటుంబాలు ఉన్నాయి.
కానీ ప్రస్తుతం కొనసాగుతున్న టికెట్స్ రేట్లతో మాత్రం యాజమాన్యం సంతృప్తిగా లేదు. అనవసరంగా ఇబ్బంది పడే బదులు క్లోజ్ చేయడం బెటర్ అని డిసైడ్ అయినట్లు సమాచారం. అలగ్వ ఆంద్రప్రదేశ్ లో చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కూడా మెల్లగా క్లోజ్ అవుతున్నాయి. మరీ దారుణంగా 5 రూపాయల టికెట్ నిర్ణయించారు అని బోర్డులు తగిలించి మరి థియేటర్స్ ను మూసేస్తున్నారు.