టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో టాలెంట్ ఉన్న దర్శకులలో కొరటాల శివ ఒకరు కాగా ఆచార్య సినిమా కొరటాల శివ కెరీర్ లో బ్యాడ్ మూవీగా నిలిచింది. పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలో విడుదలైన ఆచార్య అభిమానులకు ఒకింత షాకిచ్చింది. సాధారణంగా భారీ బ్లాక్ బస్టర్ సినిమా డిజాస్టర్ అయితే ఆ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడానికి హీరోలు సంకోచిస్తారు. అయితే కొరటాలపై పూర్తిస్థాయి నమ్మకంతో తారక్ అవకాశం ఇచ్చారు. స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా తారక్ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కళ్యాణ్ రామ్ కూడా దేవర సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దేవర సినిమా ఎంతోమంది కెరీర్ ను డిసైడ్ చేయనుంది. డబుల్ హ్యాట్రిక్ సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా పెద్దగా ప్రభావం చూపదు. అయితే ఎంతోమంది కెరీర్ లను ఈ సినిమా డిసైడ్ చేయనుంది. దర్శకుడు కొరటాల శివ, నిర్మాత మిక్కిలినేని సుధాకర్, సహ నిర్మాత కళ్యాణ్ రామ్, హీరోయిన్ జాన్వీ కపూర్. విలన్ సైఫ్ అలీ ఖాన్ కెరీర్ ఈ సినిమాపై ఆధారపడి ఉంది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకుంటే మాత్రమే కెరీర్ పరంగా మేలు జరుగుతుంది.
లేదంటే ఈ ఐదుగురి కెరీర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ వరకు ఇబ్బందేనని చెప్పవచ్చు. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ నమ్మకం ఎప్పుడూ వమ్ము కాలేదు. ఎంతోమంది ఫ్లాప్ డైరెక్టర్లకు తారక్ అండగా నిలబడి హిట్ దక్కేలా చేసిన సందర్భాలు ఉన్నాయి. కథల కంటే కంటెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన రిలీజ్ కానున్న దేవర సినిమాతో సోలో హీరోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. దేవర మూవీ ప్రశాంత్ నీల్ కు (Prashanth Neel) భారీ షాకిచ్చే టార్గెట్ ను ఇవ్వనుందని కొరటాల గత సినిమాలను మించి ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.