Priyanka Chopra: చెప్పడానికే వింతగా ఉందంటూ.. భర్త ఏజ్‌ గురించి జోకేసిన ప్రియాంక చోప్రా!

సాధారణంగా భర్త కంటే భార్య వయసు తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని జంటల్లో దాదాపు సమానంగా ఉంటుంది. కానీ చాలా తక్కువ జంటల్లో భర్త కంటే భార్య వయసు ఎక్కువగా ఉంటుంది. గతంలో మనం ఇలాంటి కొన్ని జంటల గురించి చూశాం కూడా. అయితే ఆ గ్యాప్‌ ఒకట్రెండు ఏళ్లే అని చెప్పొచ్చు. అయితే గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రా విషయంలో కాదు. ఎందకంటే ఆమెకు, ఆమె భర్త నిక్‌ జొనాస్‌కు వయసలో గ్యాప్‌ పదేళ్లు. ఈ విషయం పాతదే అయినా.. ఆమె ఇటీవల ఈ వయసు గురించి సరదాగా ఓ మాట చెప్పుకొచ్చింది.

ప్రియాంక – నిక్‌ పెళ్లి అనే దగ్గర నుండి వయసు మేటర్‌ వస్తూనే ఉంది. ఎందుకు ఇంత ఏజ్‌ గ్యాప్‌ అని అంటూనే ఉన్నారు. దీనిపై వాళ్లిద్దరు కూడా గతంలో మాట్లాడారు. తాను ప్రపంచ సుందరిగా కిరీటం గెలిచినప్పుడు నిక్‌ ఏడేళ్ల పిల్లాడని… ఇది చెప్పడానికి వింతగా ఉంటుందని ఆమె అన్నారు. దీంతో ఈ విషయం మరోసారి వైరల్‌గా మారిపోయింది. ‘‘నిక్‌ని వివాహం చేసుకున్న తర్వాత వాళ్లమ్మ నాతో ఒక విషయం చెప్పారు. దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు.

ప్రియాంక (Priyanka Chopra) ప్రపంచ సుందరిగా కిరీటం గెలుపొందినప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు. లండన్‌లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో ఆమె పాల్గొంది. 2000లో జరిగిన ఆ పోటీలను ప్రియాంక అత్తమామలు టీవీలో చూశారట. ఆమె టైటిల్‌ గెలుపొందిన క్షణాలు అత్తమామలకు ఇంకా గుర్తున్నాయట. అంతేకాదు అప్పుడు నిక్‌ వయసు 7 ఏళ్లు అని కూడా వాళ్లు ఆమెకు చెప్పారట. ఆ సమయంలో టీవీ ముందు కూర్చున్న వాళ్లలో నిక్‌ కూడా ఉన్నాడట. తలచుకుంటే వింతగా ఉంది. విధే మా ఇద్దర్నీ కలిపింది అని చెప్పింది ప్రియాంక.

మేమిద్దరం కలవాలని రాసిపెట్టి ఉంది కాబట్టి కలిశాం. అందుకే వయసుపరంగా ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ మేమిద్దరం ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం అని చెప్పింది. నిక్‌తో రిలేషన్‌లోకి వెళ్లడానికి ముందు నేను ఎంతోమందితో డేట్‌ చేశాను. అలాగే నిక్‌క్‌కు కూడా కొన్ని రిలేషన్‌షిప్స్‌ ఉన్నాయి. వాటి గురించి మేం పట్టించుకోలేదు. గతం గురించి ఆలోచించడం నచ్చదు. భవిష్యత్తు కోసం అడుగులు వేయడమే మాకు ఇష్టం అని ప్రియాంక వాళ్ల రిలేషన్‌ గురించి చెప్పుకొచ్చింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus