Priyanka Chopra: ప్రియాంక చోప్రా సినిమాలకు గుడ్ బై చెప్పడానికి అదే కారణమా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి ప్రియాంక చోప్రా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు అనంతరం అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని హాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారు. ఇలా హాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున సినిమాలు చేస్తూ వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.హాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించిన ప్రియాంక చోప్రా పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె హాలీవుడ్ సినిమాలలో నటిస్తూ అమెరికాలోనే స్థిరపడ్డారు. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్నటువంటి ప్రియాంక చోప్రా ఈ సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ప్రియాంక చోప్రా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు.

ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సినిమాలకు దూరమవుతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం తెలియడం లేదు. అయితే ఈమె సినిమాలకు దూరం కావాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఏంటి అనే విషయానికి… ఈమె తన కూతురి ఆలనా పాలన చూసుకోవడం కోసమే ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారనీ తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి ప్రియాంక చోప్రా పరోక్షంగా కూడా చెప్పారనే తెలుస్తుంది.

నా కూతురు కోసం నేను సినిమాలు కనుక మానుకోవాల్సి వస్తే రెండో ఆలోచన చేయకుండా సినిమాలు మానేస్తానని తన కుమార్తెతో కలిసి తాను వేరే దేశంలో స్థిరపడతాను అంటూ ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా చేసినటువంటి కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. కూతురి కోసం ప్రియాంక చోప్రా తన కెరీర్ వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారని తెలియడంతో అభిమానులు ఒకింత షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈమె హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే హాలీవుడ్ మూవీలో నటిస్తోంది. త్వరలోఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus