ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ (Allu Arjun) వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర తరఫున ప్రచారం చేసి వచ్చాడు. దీంతో జనసేన శ్రేణులకు, మెగా ఫ్యామిలీకి కోపం వచ్చింది. నాగబాబు (Nagendra Babu) ఆవేశంగా ఓ ట్వీట్ వేసి పరోక్షంగా బన్నీ పై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీకి బన్నీ దూరమయ్యాడు అనే ప్రచారం కూడా ఊపందుకుంది. సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తర్వాత సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా అల్లు అర్జున్ ని ఇన్స్టాగ్రామ్లో అన్ ఫాలో కొట్టడం వంటి రచ్చ అంతా జరిగింది.
ఈ విషయాల పై తాజాగా అల్లు అర్జున్ స్నేహితుడు అయిన బన్నీ వాస్ స్పందించాడు. బన్నీ వాస్ (Bunny Vasu) మాట్లాడుతూ.. “కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో అనుకోని పరిస్థితులు వస్తాయి. 20 ఏళ్లుగా నేను ఆ ఫ్యామిలీని చూస్తున్నాను. చిరంజీవి (Chiranjeevi) గారు ఎప్పుడూ కూడా కుటుంబమంతా కలిసుండాలి అని కోరుకుంటారు. సంక్రాంతి వచ్చిందంటే ఫ్యామిలీ మొత్తాన్ని బెంగళూరు ఫామ్ హౌస్ కి తీసుకెళ్తారు ఆయన. స్టార్స్ ఎక్కువగా ఉన్న ఫ్యామిలీ అది. ఖర్చు కూడా ఎక్కువవుతుంది.
అయినా కూడా చిరంజీవి గారు తగ్గరు.ఎందుకంటే కుటుంబం మొత్తం కలిసుండాలి అని. పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళకి ఇండివిడ్యువాలిటీ అనేది ఏర్పడినప్పటికీ, ‘కుటుంబం మొత్తం కలిసే ఉంది’ అనే మెసేజ్ అందరికీ చెప్పాలని ఆయన తాపత్రయ పడతారు. ఒక్కోసారి కొన్ని ఊహించని పరిస్థితులు వస్తాయి. సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంత మాత్రాన వారి మధ్య ఉన్న బాండింగ్ తగ్గిపోతుంది అని నేను అనుకోను.ఒక చిన్న సందర్భాన్ని బట్టి ‘వాళ్ళు సెపరేటు అయిపోయేంత’ నిర్ణయానికి వెళ్లడం..
అది సరైన, తెలివైన నిర్ణయం కాదు అనే నేను అనుకుంటాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆ ఫ్యామిలీ ఎప్పుడూ బాగుండాలి. బాగుంటుంది కూడా..! ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అంతే.! ” అంటూ చెప్పుకొచ్చారు. బన్నీ వాస్ మాటల్ని బట్టి చూస్తే.. చిరు ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి గ్యాప్ అనేది ఏర్పడినట్టు స్పష్టమవుతుంది. ఆయన అన్నట్టు.. వచ్చే సంక్రాంతి వరకు ఈ గ్యాప్ ఉంటుందేమో. ఆ తర్వాత కలిసిపోయే ఛాన్స్ ఉంది. ప్రతి ఫ్యామిలీలో ఇలాంటి ఇష్యూస్ కామనే..!