మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) ‘ధమాకా’ (Dhamaka) తర్వాత చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ‘రావణాసుర’ (Ravanasura) ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ‘ఈగల్’ (Eagle) ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan).. ఇలా 4 డిజాస్టర్లు ఇచ్చాడు రవితేజ. దీంతో అతనితో సినిమాలు చేయడానికి నిర్మాతలు భయపడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అందుకు ప్రధాన కారణం.. అతను భారీ పారితోషికం డిమాండ్ చేయడం వల్లనే అని చెప్పాలి. అవును రవితేజ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.30 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘ఈగల్’ ‘మిస్టర్ బచ్చన్’ వంటి సినిమాలు అతను రూ.20 కోట్లలో చేసినవే.
Ravi Teja
అయితే నాన్ -థియేట్రికల్ మార్కెట్ చూపించి ఇప్పుడు రూ.30 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. అందుకే ‘మైత్రి మూవీ మేకర్స్’ లో గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో చేయాల్సిన సినిమా ఆగిపోయింది. ఆ సినిమాకి ఓటీటీ డీల్ కూడా సెట్ అవ్వలేదట. ప్రస్తుతం రవితేజ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో ‘మాస్ జాతర’ (Mass Jathara) అనే సినిమా చేస్తున్నాడు. భాను భోగవరపు (Bhanu Bhogavarapu) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.
దీని తర్వాత రవితేజ 2 కథలు ఓకే చేశాడట. కానీ నిర్మాతలు సెట్ అవ్వడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్లో ఏ నిర్మాతకి కూడా హీరోలు అందుబాటులో లేరు. అందరూ రెండు, మూడు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. కానీ రవితేజకేమో నిర్మాతల సమస్య వచ్చి పడింది. అతను పారితోషికం తగ్గించుకుని.. రెండు, మూడు హిట్లు ఇస్తే కానీ .. కోలుకోవడం కష్టంగానే కనిపిస్తుంది.