ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా వచ్చిందట, సెకండాఫ్ లో గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ ట్రాక్.. టార్గెటెడ్ ఆడియన్స్ ను మెప్పించే విధంగా అంటుందని విమర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరోపక్క ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ పై కూడా అందరి దృష్టి పడింది.
Pushpa 2 The Rule
ఎందుకంటే.. ఎన్నడూ లేని విధంగా వెయ్యి కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మొదటి ఇండియన్ సినిమా ఇదే. అందుకే ట్రేడ్లో కూడా ‘పుష్ప 2’ హాట్ టాపిక్ అయ్యింది. థియేట్రికల్ రైట్స్ పరంగా కూడా ఈ సినిమా ఏకంగా రూ.600 కోట్లు బిజినెస్ చేయడం అందరికీ షాకిచ్చింది. సో ‘పుష్ప 2’ సినిమా హిట్ అవ్వాలంటే.. కచ్చితంగా రూ.600 కోట్లు షేర్ ను రాబట్టాల్సిందే. ఈ క్రమంలో తొలి రోజు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి కూడా అందరిలోనూ ఉంది.
ఇప్పటివరకు టాలీవుడ్లో డే 1 రికార్డు ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) (రూ.223 కోట్లు) పేరుతో ఉంది. ‘పుష్ప 2’ కి టికెట్ రేట్లు కూడా భారీగా పెంచేశారు. అయినా సరే ‘బుక్ మై షో’ లో గంటకు 60 వేల టికెట్ల చొప్పున బుక్ అవుతున్నాయి. దీంతో మొదటి రోజు కచ్చితంగా ప్రీమియర్స్ తో కలుపుకుని రూ.303 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ వంటి వాటితో కలుపుకుని ఆ లెక్క ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుందేమో చూడాలి.