అక్కినేని ఫ్యామిలీతో దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన క్లాసిక్ మూవీ ‘మనం’ లో చిన్న అతిధి పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాశీ ఖన్నా…. ‘ఊహలు గుస గుస లాడే’ చిత్రంతో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా నటించింది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2014వ సంవత్సరంలో జూన్ 20న విడుదలైంది. ఈ చిత్రం ప్రకారం నేటితో రాశీ ఖన్నా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ 8 ఏళ్ల లో ఆమె ‘ఊహలు గుస గుస లాడే’ తో పాటు ‘బెంగాల్ టైగర్’ ‘సుప్రీమ్’ ‘తొలిప్రేమ’ ‘వెంకీ మామ’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
త్వరలో ‘పక్కా కమర్షియల్’ ‘థాంక్యూ’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ‘సర్దార్’ ‘యోదా’ ‘సైతాన్ క బచ్చా’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈమె ఎన్టీఆర్ తో తప్ప మరో స్టార్ హీరోతో నటించలేకపోయింది. పలు పెద్ద సినిమాల్లో ఈమెకి అవకాశాలు వచ్చినప్పటికీ వాటికి కొన్ని కారణాల వల్ల ఆమె నో చెప్పింది. రాశీ ఖన్నా రిజెక్ట్ చేసిన లేదా మిస్ చేసుకున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) మహానుభావుడు :
శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కోసం మొదట రాశీ ఖన్నాని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మెహ్రీన్ కు అవకాశం దక్కింది.
2) గీత గోవిందం :
విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. నిజానికి మొదట రాశీ ఖన్నాని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టుని మిస్ చేసుకుంది.
3) ఎఫ్ 2 :
వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీలో మొదట మెహ్రీన్ పాత్రలో రాశీ ఖన్నా ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రానికి నో చెప్పింది.
4) మజిలీ :
నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం ఈమెను సంప్రదించారు. కానీ ఈమె నో చెప్పడంతో దివ్యాంశ కౌశిక్ ను ఎంపిక చేసుకున్నారు.
5) రాక్షసుడు :
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ మూవీ ‘రాట్ససన్’ కి రీమేక్ గా తెరకెక్కింది.
6) టక్ జగదీష్ :
నాని హీరోగా నటించిన ఈ చిత్రానికి కూడా రాశీ ఖన్నాని సంప్రదించారు. కానీ ఆమె ఈ ఆఫర్ కు నొ చెప్పింది.
7) భూమి :
జయం రవి హీరోగా నటించిన ఈ మూవీలో మొదట హీరోయిన్ గా రాశీ ఖన్నాని అనుకున్నారు. కానీ ఆమె ఈ సినిమా ఆఫర్ కు నో చెప్పింది.
8) మానాడు :
శింబు హీరోగా నటించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా ని హీరోయిన్ గా సంప్రదించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఆఫర్ కళ్యాణి ప్రియదర్శన్ కి వెళ్ళింది.
9) మహా సముద్రం :
ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా రాశీ ఖన్నా కి అవకాశం వచ్చింది. కానీ ఎందుకో రాశీ నొ చెప్పి ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకుంది.
10) సర్కారు వారి పాట :
మహేష్ బాబు హీరోగా నటించిన ఈ మూవీకి పరశురామ్ పెట్ల దర్శకుడు. ఈ చిత్రం కోసం హీరోయిన్ గా మొదట రాశీ ఖన్నా ని అనుకున్నారు. నిర్మాతల ఒత్తిడి మేరకు ఇందులో కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నారు.
వీటితో పాటు మరికొన్ని మిడ్ రేంజ్ సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ వస్తే ఆమె మిస్ చేసుకున్నట్టు తెలుస్తుంది.