పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ బాక్సాఫీస్ వద్ద దారుణమైన పెర్ఫార్మన్స్ ఇస్తుంది. మొదటి వారం పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం కలెక్షన్లు రెండో వీకెండ్ ను ఎలా క్యాష్ చేసుకుంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మౌత్ టాక్ బ్యాడ్ గా ఉండడంతో కలెక్షన్లు పడిపోయాయి. రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థతో కలిసి ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ నిర్మించింది.
వీకెండ్ వరకు బాగానే కలెక్ట్ చేసిన ఈ చిత్రం వీక్ డేస్ లోకి వచ్చేసరికి జోరు చూపించలేకపోయింది.
ఒకసారి 8డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
23.96 cr
సీడెడ్
07.27 cr
ఉత్తరాంధ్ర
04.94 cr
ఈస్ట్
04.24 cr
వెస్ట్
03.26 cr
గుంటూరు
04.37 cr
కృష్ణా
02.59 cr
నెల్లూరు
02.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
52.73 cr
తమిళ్ నాడు
0.81 cr
కేరళ
0.38 cr
కర్ణాటక
04.25 cr
నార్త్ ఇండియా (హిందీ)
09.35 cr
ఓవర్సీస్
11.20 cr
రెస్ట్
04.16 cr
టోటల్ వరల్డ్ వైడ్
82.88 cr
‘రాధే శ్యామ్’ చిత్రానికి రూ.196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు రూ.200 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.82.88 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.117.12 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది పూర్తిగా అసాధ్యమే.!
అయితే ఈ వీకెండ్ ను అయినా క్యాష్ చేసుకుని రూ.100 కోట్ల షేర్ క్లబ్ లో జాయిన్ అవుతుందేమో అని కొంతమంది ట్రేడ్ పండితులు అనుకున్నారు. కానీ నిన్న హోలీ హాలిడేని కూడా ఈ మూవీ క్యాష్ చేసుకోలేకపోయింది.