మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఓటింగ్ అయిపోయింది, లెక్కింపు అయిపోయింది, రేపో మాపో కొత్త ప్రెసిడెంట్ మంచు విష్ణు ప్రమాణ స్వీకారం కూడా చేస్తాడు. ఈ సమయంలో ‘మా’ ఎన్నికల గురించి ప్రముఖ దర్శకుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందించారు. ‘అసలు ఇలా జరిగి ఉండకూడదు’ అంటూ ‘మా’ ఎన్నికల గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఇప్పుడు టైమ్ కాదు కానీ… అవి తెలుసుకోవాల్సిందే. ‘మా’ ఎన్నికలు ఇంతలా అలజడి సృష్టించడం తెలుగు సినిమా పరిశ్రమకు మంచిది కాదన్నారు రాఘవేంద్రరావు.
సినిమా పెద్దలు అందరూ కలసి ‘మా’ అధ్యక్షునిగా ఎవరో ఒకర్ని ఏకగ్రీవంగాఎన్నుకునుంటే బాగుండేది అన్నారు. ‘మా’ విషయంలో అదే మంచి పద్ధతి కూడా అన్నారు. అయితే మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా రాణిస్తాడనే నమ్మకం తనకు ఉందని రాఘవేంద్రరావు పేర్కొన్నారు.గత కొన్ని పర్యాయాలుగా ‘మా’ ఎన్నికలు వచ్చినప్పుడల్లా… ఈ ‘ఏకగ్రీవం’ కాన్సెప్ట్ ముందుకొస్తోంది. అయితే అందరూ విన్నట్లే ఉంటున్నారు కానీ, ఎవరూ వినడం లేదు.
ఇప్పుడు కూడా అదే జరిగింది. మరీ ఎర్లీగా ఆలోచిస్తున్నాం అనుకోకపోతే వచ్చే ఎన్నికలప్పుడైనా ‘ఏకగ్రీవం’ నెరవేరాలి. దానికి చాలామంది పెద్దల ఆశీర్వాదాలు, మార్గదర్శకాలు ఉండాలి. చూద్దాం ఏమవుతుందో.