‘పెళ్ళి తర్వాత మంగళ సూత్రం ధరించాలా? వద్దా? అనేది పూర్తిగా ఆడవాళ్ళ వ్యక్తిగత నిర్ణయంగా నేను భావిస్తాను. నా భార్య చిన్మయిని మంగళసూత్రం వేసుకోవద్దు అనే నేను చెబుతుంటా. ‘పెళ్ళి అయ్యింది’ అనేది తెలియడానికి ఆధారంగా ఆడవాళ్ళకి తాళి ఉంటుంది. కానీ మగవారికి ఎటువంటి ఆధారం ఉండదు. ఒక రకంగా ఇది కూడా ఒక వివక్షే’ అంటూ ఇటీవల నటుడు, దర్శకుడు అయినటువంటి రాహుల్ రవీంద్రన్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ను ప్రతి ఒక్కరూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. చిన్మయి ఫెమినిస్ట్ అనే సంగతి అందరికీ తెలిసిందే.
ఆమెను భర్త రాహుల్ మొదటి నుండి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అందులో ఎలాంటి తప్పూ లేదు. కానీ ఇండియాలో మంగళసూత్రాన్ని చాలా పవిత్రంగా చూస్తుంటారు. ఆడవాళ్లు దాని విషయంలో ఎమోషనల్ గా ఫీలవుతుంటారు. అలాంటి గొప్ప విలువలు కలిగిన మంగళసూత్రం గురించి రాహుల్ తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది చాలా మంది అభిప్రాయం.

రాహుల్ కామెంట్స్ కే చాలా మంది ఫైర్ అవుతుంటే.. తాజాగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ రష్మిక ‘మగవాళ్ళకి కూడా పీరియడ్స్ వస్తే బాగుణ్ణు. అప్పుడు ఆడవాళ్ళ బాధ కూడా అర్థమవుతుంది’ అంటూ కామెంట్స్ చేయడం కూడా దుమారం రేపాయి. ‘చిన్మయి, రాహుల్ వంటి ఫెమినిస్ట్..లతో కలిసి సినిమాలు చేయడం వల్ల రష్మిక కూడా వారిలానే తయారయ్యింది.. అందుకే ఇలాంటి చిల్లర కామెంట్లు చేస్తుంది’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు రష్మికపై ఫైర్ అవుతున్నారు.
