Rajamouli, Mahesh Babu: కెరీర్ లో తొలిసారి జక్కన్న అలా చేస్తున్నారా?

మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కాకపోయినా ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా పూర్తైన తర్వాతే మహేష్ రాజమౌళి కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మహేష్ సినిమా కథకు సంబంధించి రాజమౌళి ఇంకా కథ విషయంలో ఫిక్స్ కాలేదని బోగట్టా.

మహేష్ కోసం జక్కన్న రెండు కథలను సిద్ధం చేశారని అయితే మహేష్ వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత ఈ రెండు కథలలో ఒక కథ ఫైనల్ కానుందని బోగట్టా. కెరీర్ లో రాజమౌళి తొలిసారి ఈ విధంగా రెండు కథలను సిద్ధం చేసి ఒక కథను హీరోతో ఫైనల్ చేయించనున్నారని తెలుస్తోంది. రాజమౌళి ఈ సినిమాను 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

మరోవైపు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఎనౌన్స్ మెంట్ వస్తుందో లేదో చూడాల్సి ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం యూరోప్ లో ఉండగా కృష్ణ పుట్టినరోజు సమయానికి మహేష్ హైదరాబాద్ కు వస్తారో లేదో చూడాల్సి ఉంది. మహేష్ బాబుకు సినిమాసినిమాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. మహేష్ సినిమాసినిమాకు తన మార్కెట్ పెరిగేలా జాగ్రత్త పడుతున్నారు.

త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలతో మహేష్ రేంజ్ ఏ స్థాయిలో పెరగనుందో చూడాల్సి ఉంది. రాజమౌళి సినిమాతోనే మహేష్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కే ఛాన్స్ అయితే ఉంది. మహేష్ బాబు రాజమౌళి సినిమా విడుదలయ్యే వరకు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది. మహేష్ సినిమాను బట్టి బడ్జెట్ ను బట్టి రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. మహేష్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.