Rajamouli: మహేష్ సినిమాలో RRR ఫార్ములా.. అంతకుమించి!

దర్శక ధీరుడు రాజమౌళి  (Rajamouli) తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu)  కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘SSMB29’ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని సమాచారం, మహేష్ కూడా ఇందులో తన పాత్రకు అనుగుణంగా స్టైలిష్ లుక్ లోకి మారిపోయారు. ఇటీవల ఆయన పొడవాటి జుట్టు, గెడ్డంతో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది, ఇది జక్కన్న ప్రణాళికలో భాగమేనని చెబుతున్నారు.

Rajamouli

కెఎల్ నారాయణ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా రాజమౌళి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘SSMB29’ గురించి ఆసక్తికరమైన వివరాలు బయటపడ్డాయి. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) లో యానిమల్స్ ను వాడినట్లే, నెక్స్ట్ సినిమాలో కూడా అవి కనిపిస్తాయా అని ప్రశ్నించగా, ఈ చిత్రంలో ‘ఆర్ఆర్ఆర్’ కంటే ఎక్కువ యానిమల్స్ ఉంటాయని వెల్లడించారు.

ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో భారీగా అంచనాలు రేపాయి. ‘SSMB29’ కథ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ లో ఉంటుందని, వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా మహేష్ బాబు పాత్ర ఉంటుందని జక్కన్న ఇప్పటికే హింట్ ఇచ్చారు. అడ్వెంచర్ నేపథ్యంలో యానిమల్స్ అవసరం తప్పక ఉంటుంది, ఆ జోనర్‌లో కొత్తగా ఎలాంటి ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది.

‘ఆర్ఆర్ఆర్’ ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో అద్భుతంగా డిజైన్ చేసిన యానిమల్ సీక్వెన్స్ ను గుర్తు చేస్తూ, ఇక్కడ కూడా అలాంటి ఆకట్టుకునే సన్నివేశాలు ఉంటాయా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి స్టైల్ లో యానిమల్స్ తో యాక్షన్ సీన్స్ ఉంటే మహేష్ బాబు రోల్ మరింత పవర్‌ఫుల్ గా కనిపించవచ్చని అనుకుంటున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ‘SSMB29’ నుంచి అధికారిక అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 ప్రారంభంలో ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుందని ప్రచారం నడుస్తోంది. మరోవైపు, హాలీవుడ్ హీరోయిన్ మహేష్ కి జోడీగా నటించనున్నారని వినిపిస్తోంది.

టైర్ 1లోకి దూకేలా నాని బిజినెస్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus