Rajamouli: రాజమౌళి-మహేష్ సినిమా.. హీరోయిన్ కన్ఫర్మ్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం రాజమౌళి స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో సినిమా షూటింగ్ మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన క్యాస్టింగ్ ను ఫిక్స్ చేసే పనిలో పడింది రాజమౌళి టీమ్.

ఈ క్రమంలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకోన్ ను తీసుకోవాలనుకుంటున్నారట. మహేష్ బాబు సరసన దీపికాను తీసుకోవాలనేది రాజమౌళి ప్లాన్. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ K’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమాకి డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రాజమౌళి లాంటి దర్శకుడు పిలిచి ఆఫర్ ఇస్తే ఏ హీరోయిన్ మాత్రం కాదంటుంది. కాబట్టి కచ్చితంగా దీపికా పదుకోన్.. మహేష్ బాబు సినిమాకి ఓకే చెప్పడం ఖాయం.

ప్రస్తుతానికైతే దీపికాను ఆన్ బోర్డ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మరి ఈ లిస్ట్ లోకి ఇంకెవరైనా చేరతారేమో చూడాలి. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు సినిమా ఎలా ఉండబోతుందో చెప్పారు రాజమౌళి. మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ సినిమా చేయబోతున్నానని చెప్పారు రాజమౌళి.

అంటే ప్రపంచమంతా రిలేట్ అయ్యే కంటెంట్ అందులో ఉంటుందని అర్ధం. అంటే ఈసారి వరల్డ్ మొత్తం రీచ్ అయ్యే కంటెంట్ తో సినిమా తీయబోతున్నారన్నమాట. ఈ సినిమాకి కె.ఎల్.నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus