రాజమౌళికి తెలియని ఒకే ఒక్క విషయం కాంప్రమైజ్. ఆయన తనకు కావలసిన అవుట్ ఫుట్ సాధించే వరకు ట్రై చేస్తూనే ఉంటాడు. అంతే కానీ వచ్చిన అవుట్ ఫుట్ తో సరిపెట్టుకొని సినిమా విడుదల చేయడు. అందుకే రాజమౌళి పరిశ్రమలో ఓటమి ఎరుగని దర్శకుడిగా ఉన్నాడు. ఐతే ఆర్ ఆర్ ఆర్ విషయంలో రాజమౌళి కాంప్రమైజ్ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన సంక్షోభం మరియు పరిస్థితులు ఆయన ఈ నిర్ణయానికి కారణం అయ్యాయని తెలుస్తుంది.
కాగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడట. దానికి కారణం షూటింగ్స్ కి ఏర్పడిన ఇబ్బందులే అని తెలుస్తుంది. టాలీవుడ్ లో సినిమాల షూటింగ్స్ కి అనుమతులు ఇవ్వడం జరిగింది. పరిమిత సిబ్బందితో, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ నిర్వహించుకొనే వెసులుబాటు ఉంది. కానీ ఆర్ ఆర్ ఆర్ స్క్రిప్ట్ రీత్యా నార్త్ ఇండియాతో పాటు ప్రపంచంలోని అద్భుత లొకేషన్స్ లో మూవీ చిత్రీకరించాలని రాజమౌళి భావించారు.
ఐతే అది ఇప్పుడు అది జరగనిపని. బయటికి వెళ్లి షూటింగ్స్ నిర్వహించడానికి పర్మిషన్స్ ఆయా ప్రభుత్వాలు ఇవ్వవు. మరో వైపు ఇప్పటికే ఓ సారి వాయిదా పడిన ఆర్ ఆర్ ఆర్ వీలైనంత తొందరగా విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి తన స్క్రిప్ట్ కి మార్పులు చేశారని సమాచారం. ఎక్కువ భాగం సెట్స్ లో చిత్రీకరించేలా కొన్ని మార్పులు చేశారట.