ఆర్ ఆర్ ఆర్ మూవీపై ఎంత ఆసక్తి జనాల్లో నెలకొని వుందో.. అంతకు మించిన ఆత్రుత కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ని, అల్లూరి సీతారామ రాజుగా చరణ్ ని చూడాలని వారి ఫ్యాన్స్ లో ఉంది. వీరి లుక్స్ బయటకు రాకుండా రాజమౌళి చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొద్దో గొప్పో ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించిన విషయాలు బయటికి వచ్చినప్పటికీ అసలు సంగతులు అలానే గుట్టుగా ఉన్నాయి. కాగా నిన్న కరోనా వైరస్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్, చరణ్ కలిసి ఓ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో వారి లుక్స్ పై అనేక అనుమానాలు లేవనెత్తింది.
కొద్దిరోజుల క్రితం వరకు బాగా పెరిగిన జుట్టు, గడ్డంతో ఎన్టీఆర్ కనిపించగా నిన్న విడుదలైన వీడియోలో ఆయన కొంచెం తగ్గించిన జుట్టు, ట్రిమ్ చేసిన గడ్డంలో కనిపించారు. ఎన్టీఆర్ లుక్ లో రాజమౌళి ఈ మార్పు ఎందుకు చేశారో అర్థం కాలేదు. ఇక రామ్ చరణ్ లుక్ కూడా కొంచెం మారింది. ఆయన క్లీన్ షేవ్ లో కనిపించడంతో పాటు, జుట్టు కూడా కొంచెం తగ్గించినట్లున్నారు. అసలు చరిత్రలో అల్లూరి సీతారామ రాజు గడ్డం లేకుండా కనిపించిన దాఖలాలు లేవు. ఆయన మరణించే నాటికి పెద్ద గుబురు గడ్డంతో ఉన్నారు. మరి అల్లూరి పాత్ర చేస్తున్న చరణ్ క్లీన్ షేవ్ లో ఎలా కనిపిస్తారు అనేది ఆసక్తికరం. చారిత్రక పాత్రలకు కాల్పనిక జోడించి ఈ సినిమా తెరకెక్కుతోందని గతంలోనే రాజమౌళి చెప్పిన నేపథ్యంలో వీరి లుక్స్ విషయం లో కూడా రాజమౌళి హిస్టరీ ఫాలో కాలేదేమో అనిపిస్తుంది.