అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2: ది రూల్ (Pushpa 2: The Rule) బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 800 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి, ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటన, సుకుమార్ కథనం ప్రేక్షకుల్ని అలరించాయి. మాస్ ఎమోషన్స్‌తో నిండిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. ఇదిలా ఉండగా, భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన ఎస్ఎస్ రాజమౌళి (S. S. Rajamouli) పుష్ప 2పై స్పెషల్ షోలో సినిమా చూశారు.
Rajamouli
హైదరాబాద్‌లో విమల్ థియేటర్ లో షోకు ఆయన కుటుంబసభ్యులతో హాజరయ్యారట. సినిమా చూసిన తర్వాత రాజమౌళి ఎలా స్పందిస్తారో అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కూడా సుకుమార్ ప్రాజెక్టులపై రాజమౌళి ఎంతో ఆసక్తిగా స్పందించారు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ గురించి ఆయన చెప్పిన మాటలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. ఇప్పుడు, పూర్తిస్థాయిలో సినిమా చూసిన రాజమౌళి తన అభిప్రాయాన్ని ఎలా పంచుకుంటారనేది ఆసక్తిగా మారింది.
సినిమా కథనం, అల్లు అర్జున్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ టేకింగ్ పట్ల రాజమౌళి ఏం చెప్పబోతున్నారు? అనే అంశాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కానీ సినిమా చూసి ఒక రోజు గడిచిన తరువాత కూడా జక్కన్న సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ కూడా వేయాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా ఏ సినిమా చూసినా గంటలో ట్వీట్ వేస్తారు. కానీ జక్కన్న 24 గంటలు గడిచినా ఇంకా రెస్పాండ్ అవ్వలేదు.
పుష్ప 2 అందించిన విజయం, అందులోని కథా మేజిక్ పట్ల రాజమౌళి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తే, సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నార్త్ ఇండియా మార్కెట్‌లో పుష్ప 2 భారీ విజయాన్ని అందుకుంది. హిందీ వెర్షన్ ఒక్కటే రూ. 300 కోట్లు దాటడం గమనార్హం. ఈ నేపథ్యంలో, రాజమౌళి రియాక్షన్ పుష్ప 2కి మరింత వేగాన్ని ఇవ్వగలదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఆయన రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.