‘బాహుబలి’ ‘బాహుబలి 2’ సినిమాలను కలిపి ‘బాహుబలి – ది ఎపిక్’ గా రీ రిలీజ్ చేస్తున్నారు రాజమౌళి. అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని రీ- రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్,రానా..లతో రాజమౌళి ఫన్నీ చిట్ చాట్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన 2015 లో ‘బాహుబలి’ కి వచ్చిన మిక్స్డ్ టాక్ ను గుర్తు చేసుకుని.. ఎవ్వరికీ తెలియని విషయాలు చెప్పుకొచ్చారు.
రాజమౌళి మాట్లాడుతూ… “బాహుబలి సినిమా మొదటి రోజు ఎర్లీ మార్నింగ్ షోలకు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.కొంతమంది డిజాస్టర్ టాక్ చెప్పారు. ఒక వాట్సాప్ గ్రూప్లో వదిన వల్లీ గారు జాయిన్ అయ్యారు. ఆమె ఎలా జాయిన్ అయ్యారో తెలీదు. అందులో జర్నలిస్టులు, పీఆర్ఓ లు అంతా ఉన్నారు. సినిమా చూశాక వాళ్ళు మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టారు. ప్రభాస్ శివలింగం ఎత్తే పోస్టర్ ని.. మార్ఫింగ్ చేసి శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.

తర్వాత ఇంకొంతమంది వీళ్ళేమైనా పుడింగులు అనుకుంటున్నారా,గొప్ప సినిమా తీశాం అనుకుంటున్నారా, వీళ్ళు అయిపోయారు. ఇది బాహుబలి కాదు ప్రొడ్యూసర్ బలి, డిస్ట్రిబ్యూటర్ బలి, ఎగ్జిబిటర్ బలి అంటూ నెగిటివ్ కామెంట్లు చేశారు. అయితే నాకు ఉన్న ఒక్క హోప్ ఏంటంటే.. మనం బ్యాడ్ సినిమా అయితే తీయలేదు అని. ఇవి వదిన గారు మాకు చెప్పలేదు. ఆవిడే చూస్తూనే ఉంది. తర్వాత సాయి గారు వచ్చి ఈ టాక్ పట్టించుకోకండి.

మార్నింగ్ షోల కంటే ఈవెనింగ్ లకు కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్లాప్ టాక్ అయితే కలెక్షన్స్ పెరగవు అన్నారు. నిర్మాత శోభు గారి పరిస్థితి ఏంటా అని భయం వేసింది. పోనీ నా దగ్గర ఆస్తులు ఏమీ లేవు. అప్పుడు పార్ట్ 2 ని తక్కువ బడ్జెట్లో తీసి సేవ్ చేద్దాం అనే ఆలోచన కూడా వచ్చింది. కానీ కట్ చేస్తే తర్వాత టాక్ మారింది కలెక్షన్స్ భారీగా వచ్చాయి” అంటూ చెప్పుకొచ్చారు. రాజమౌళి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
