ఆర్ ఆర్ ఆర్ లో జక్కన్నకు ఆ హీరో అంటే ఎక్కువ మక్కువా..?

ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి చేస్తున్న మల్టీ స్టారర్ పై ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు. ఒకనాటి తెలుగు వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి స్టార్ డమ్ లో కొంచెం అటూ ఇటుగా సమాన హోదా కలిగిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు స్క్రీన్ స్పేస్, సన్నివేశాల ప్రాధాన్యత ఎవరికి ఎక్కువ ఉంటుంది, అనేది మొదటి నుండి అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఐతే ఆర్ ఆర్ ఆర్ ప్రారంభంలోనే రాజమౌళి ఈ ప్రశ్నకు, ఇద్దరి హీరోలకు సమాన స్పేస్, ప్రాధానత్య ఉంటుందని చెప్పారు. ఐతే తాజా పరిణామాలు చూస్తుంటే రాజమౌళి ఎన్టీఆర్ కి కొంచెం అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తుంది.

ఎన్టీఆర్ ఎక్కువ భాగం షూటింగ్ షెడ్యూల్స్ నందు పాల్గొంటున్నారు.ఓ నెల క్రితం విశాఖలో జరిగిన షెడ్యూల్ లో కేవలం ఎన్టీఆర్ మాత్రమే పాల్గొన్నారు.ఇక ఇటీవల లీకైన వీడియో ద్వారా ఎన్టీఆర్ కి పులితో పోరాటం చేయడం వంటి భీకర పోరాట సన్నివేశం రాజమౌళి డిజైన్ చేశారని అర్థం అవుతుంది.ఇవన్నీ గమనిస్తుంటే ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి పాత్రకు మించిన హీరోయిజం… ఎలివేషన్ కొమరం భీమ్ పాత్రకు ఇచ్చారేమో అనే అనుమానం కలుగుతుంది.గతంలో వచ్చిన అనేక స్టార్ హీరోల మల్టీ స్టారర్ లు చూసినా ఏదో ఒక హీరోకి కొంత అధిక ప్రాధానత్య దక్కడం గమనించవచ్చు. ఐతే ఇవన్నీ ఊహాగానాలే..అసలు విషయం తెలియాలంటే ఆర్ ఆర్ ఆర్ విడుదల కావాలి.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus