ఆర్ ఆర్ ఆర్ లో అమ్మడి కోసం కొత్త పాటను యాడ్ చేస్తున్నారట

హీరోయిన్లు రెండు రకాలు.. సినిమా ఒప్పుకున్నామా, రెమ్యూనరేషన్ తీసుకున్నామా, ఇచ్చిన సన్నివేశాల్లో ఏదో ఒకటి చేసి నటించేసామా, గ్లామర్ షో చేసామా, వెళ్లిపోయామా అనుకొనేవారు ఒక రకమైతే. ఒప్పుకున్న పాత్ర బాడీ లాంగ్వేజ్ కోసం, భాష-యాస కోసం శ్రమించి.. పోషించే పాత్రకి ప్రాణ ప్రతిష్ట చేసేవారు ఇంకొందరు. ఈ రెండో కోవకు చెందిన నటీమణి ఆలియా భట్. ఈ బాలీవుడ్ బ్యూటీ త్వరలోనే టాలీవుడ్ లో తెరంగేట్రం చేయనుంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్.ఆర్.ఆర్” సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటించనున్న ఆలియా తన పాత్ర కోసం వర్క్ షాప్ మొదలుపెట్టింది.

ఈ వర్క్ షాప్ లో ఆలియా ప్రతిభ చూసిన రాజమౌళి తెగ ఇంప్రెస్ అయిపోయాడట. “ఆర్ ఆర్ ఆర్”లో ఆమె కోసం రాసుకున్న సన్నివేశాల నిడివి పెంచడంతోపాటు ఆమె కోసం ఒక స్పెషల్ సాంగ్ ను కూడా డిజైన్ చేస్తున్నాడట. ఆలియా ప్రతిభను తెలుగు ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో పరిచయం చేసే స్థాయిలో ఆ పాట ఉండబోతోందని తెలుస్తోంది. మరి రాజమౌళి స్పెషల్ ఇంట్రెస్ట్ కు ఆడియన్స్ ఎంతవరకూ ఇంప్రెస్ అవుతారో చూడాలి.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus