దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి'(సిరీస్) తరువాత రూపొందిస్తున్న భారీ బడ్జెట్ మరియు భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తుండగా.. కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం పూర్తి టైటిల్ ‘రణం రౌద్రం రుషితం’ అని ఆనౌన్స్ చేసారు. ఇక చరణ్ పుట్టిన రోజున ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో ఓ వీడియోని రిలీజ్ చెయ్యగా దానికి అద్బుతమైన స్పందన లభించింది.
ఎన్టీఆర్ పుట్టిన రోజున కూడా ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో మరో వీడియోని విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ పాన్ ఇండియా చిత్రంలో దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ పాత్ర చాలా ఉందట. ‘బాహుబలి’ మొత్తం ఆ స్థాయిలో ఉండడానికి కార్తికేయ పనితనం కూడా చాలా ఉంది. యూనిట్ డైరెక్టర్ గా సెట్ లో ప్రతీ పనిని ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తాడు అనే ఉద్దేశంతో …
సెట్ లోని అన్ని పనులూ తన కొడుకుకే అప్పగిస్తాడట మన జక్కన్న. రాజమౌళి యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు వేరే నటీనటులతో .. మిగిలిన సన్నివేశాలు డైరెక్ట్ చేస్తూ ఉంటాడట కార్తికేయ. అంతేకాదు షూటింగ్ లొకేషన్లను వెతికి ఫైనల్ చెయ్యడం. హీరో, హీరోయిన్ల కాల్షీట్ల అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడట. తెర వెనుక ఈయన పాత్ర రాజమౌళి కంటే పెద్దదే అని తెలుస్తుంది.