Rajamouli: ఆ అభిమానులపై దృష్టి పెట్టిన జక్కన్న!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోగా అతి త్వరలో ఈ సినిమా నుంచి మాస్ సాంగ్ రిలీజ్ కానుంది. అయితే ఈ మాస్ సాంగ్ లో చరణ్, తారక్ ఇద్దరూ కనిపిస్తారా? లేక ఒక్క హీరోనే కనిపిస్తారా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. మాస్ ప్రేక్షకుల్లో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు పెంచేలా జక్కన్న ప్లాన్ చేశారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కించిన రాజమౌళి ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ కు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దానయ్య సినిమా హక్కులను కొంతమొత్తం తక్కువ రేట్లకే అమ్మారని సమాచారం. ఓవర్సీస్ లో సైతం ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.

దేశభక్తి కథాంశంతో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతున్నా కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండేలా రాజమౌళి ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమాను వేగంగా పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ లో షాకింగ్ ట్విస్టులు ఉంటాయని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని సమాచారం. దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus