Rajamouli, Mahesh Babu: మహేష్‌ సినిమా గురించి అడిగితే.. డిక్షనరీ వెతికించారుగా!

చాలా రోజుల క్రితం దివంగత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ఆయన ఓ రాసిన పాటలోని ఓ పదం అర్థం కోసం డిక్షనరీలో వెతుక్కునేలా ఉంటుంది. అలా గొప్ప పదం గురించి తెలుసుకొని ఆనందపడతాం అని చెప్పారు. ఇప్పుడు ఇంచుమించు అలాంటి పరిస్థితే కల్పించారు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఓ ఫిలిం ఫెస్టివల్‌ కోసం టొరంటో వెళ్లిన రాజమౌళి.. అక్కడ మహేష్‌బాబు సినిమా గురించి మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన వాడిన ఓ ఆంగ్ల పదం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మహేష్‌బాబుతో రాజమౌళి సినిమా అంటూ చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. ఎట్టకేలకు మొన్న సంక్రాంతికి సినిమా అనధికారిక అనౌన్స్‌మెంట్ జరిగింది. త్వరలో అధికారికంగా సినిమా మొదలవుతుంది. అయితే దానికి ఆరేడు నెలలు పట్టొచ్చు. అయితే ఈ లోపు జక్కన్న ఎక్కడికెళ్లినా మహేష్‌ సినిమా గురించి అడుగుతున్నారంతా. ఈ క్రమంలో ఆయనకు ఇటీవల ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ‘గ్లోబల్‌ ట్రాటింగ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌’ అని చెప్పారు.

యాక్షన్‌ అడ్వెంచర్‌ అంటే ఏంటో మనకు తెలుసు. కానీ ఈ గ్లోబల్‌ ట్రాటింగ్‌ అంటే ఏంటి అనేది తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. గూగుల్‌లో చూస్తే.. రెండు రకాల సమాధానాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ప్రపంచం చుట్టూ తిరగే ఓ యాక్షన్‌ అని అర్థం. మరకొటి ప్రపంచాన్ని చుట్టి రావడం. అంటే ఈ లెక్కన మహేష్‌ – రాజమౌళి సినిమా యాక్షన్‌ అడ్వెంచరే కానీ.. ప్రపంచంలోని చాలా ప్రాంతాలను కనెక్ట్‌ చేసే యాక్షన్‌ అడ్వెంచర్‌ అని చెప్పొచ్చు.

ఈ లెక్కన ఈ సినిమా పాన్‌ ఇండియా అని సులభంగా చెప్పేయొచ్చు. అలాగే సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేసే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. అయితే మహేష్‌ బాబును జేమ్స్‌ బాండ్‌ లుక్‌లో చూడాలని తండ్రి కృష్ణ ఎప్పటి నుండో చెబుతున్నారు. మరి రాజమౌళి అలా ఏమైనా చూపిస్తారేమో చూడాలి. ఒకవేళ అది కాదంటే.. అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్‌ కథ అని గతంలో వార్తలొచ్చాయి. అదైనా కావొచ్చు.

ఈ సినిమాను కె.ఎల్.నారాయణ నిర్మించనున్నారనే విషయం తెలిసిందే. రాజమౌళికి, మహేష్‌కి ఆయన ఎప్పుడో అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు చేస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సినిమా ప్రారంభం కావొచ్చు. ముగింపు, విడుదల ఎప్పుడు అనేది మన చేతుల్లో లేవు. నిజానికి రాజమౌళి చేతుల్లో కూడా లేవు. ఈ మాట ఆయనే అన్నారనుకోండి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus