సీనియర్ హీరో రాజశేఖర్ (Rajasekhar) ‘ఎక్స్ట్రా’ (Extra Ordinary Man) సి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. కానీ ఆ సినిమాలో రాజశేఖర్ పాత్ర అనుకున్న స్థాయిలో క్లిక్ అవ్వలేదు. అయినప్పటికీ రాజశేఖర్ కి విలన్ రోల్స్ వంటివి చాలా వచ్చాయి. కానీ ఆయన సెలక్టివ్ గా చూజ్ చేసుకుంటున్నారు. ‘రంగస్థలం’ (Rangasthalam) ‘రామబాణం’ (Ramabanam) వంటి సినిమాల్లో కీలక పాత్రల కోసం రాజశేఖర్ ను సంప్రదించారు. కానీ ఎందుకో రాజశేఖర్ వాటికి అంగీకరించలేదు. ఫైనల్ గా ఆయన ఓ క్రేజీ సినిమాలో ఛాన్స్ కొట్టినట్టు టాక్.
విషయంలోకి వెళితే.. ‘కింగ్డమ్’ (Kingdom) తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru) ఫేమ్ రవికిరణ్ కోలా (Ravi Kiran Kola) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. దీనికి ‘రౌడీ జనార్దన్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju)నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ రోల్ చాలా కీలకం అని తెలుస్తుంది. మాసిన గడ్డం, రఫ్ లుక్ తో కాకుండా.. కనుసైగలతో ఒక ఊరి జనాలను శాసించే విధంగా పవర్ఫుల్ గా విలన్ పాత్ర ఉండాలట.
దీని కోసం రెగ్యులర్ విలన్ గా కాకుండా.. సీనియర్ హీరోని తీసుకోవాలని టీం భావించింది. ఈ క్రమంలో రాజశేఖర్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం.ఆల్రెడీ లుక్ టెస్ట్ కూడా నిర్వహించారట. రాజశేఖర్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం వల్ల అతన్నే ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ పాత్ర కోసం రాజశేఖర్ కు ఎక్కువ పారితోషికం ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది.