35 సంవత్సరాల సినీ కెరీర్ లో రాజశేఖర్ ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే. త్వరలో రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ మూవీ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 4వ తేదీ రాజశేఖర్ పుట్టినరోజు కాగా ఆచార్య సినిమా రిలీజ్ కాకపోతే ఆ తేదీకి ఈ సినిమాను విడుదల చేయాలని జీవిత భావిస్తున్నారు. తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగా షోకు అతిథులుగా హాజరైన జీవిత, రాజశేఖర్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మైనా థియేటర్ లో తొలిసారి తాను జీవితను చూశానని రాజశేఖర్ తెలిపారు. చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలనే కోరిక ఉండేదని అయితే నత్తి ఉందనే కారణం వల్ల సినిమాల్లో ఛాన్స్ ఇచ్చిన తర్వాత తీసేస్తారనే భయం ఉండేదని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత యాక్టింగ్ స్కూల్ లో చేరి యాక్టింగ్ నేర్చుకుని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే సినిమాల్లోకి వచ్చానని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో జీవితను, పిల్లల్ని ధైర్యంగా ఉండాలని సూచించానని ప్రేక్షకుల ప్రార్థనలే నన్ను కాపాడాయని రాజశేఖర్ కామెంట్లు చేశారు.
శేఖర్ మూవీలో మొదట శివాని లేదని అద్భుతం సినిమా సక్సెస్ సాధించడంతో శివానిని ఈ సినిమాకు ప్లస్ అయిందని రాజశేఖర్ వెల్లడించారు. మనం ఏది చేస్తామో అదే తిరిగొస్తుందని దానిని కర్మ అని నమ్ముతానని రాజశేఖర్ అన్నారు. అంకుశం సినిమా షూటింగ్ సమయంలో రామిరెడ్డిని కొట్టినా ఆయన కదలలేదని డైరెక్టర్ సూచనల ప్రకారం రామిరెడ్డిని నిజంగానే కొట్టానని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. అంకుశం మూవీకి ఆ సీన్ హైలెట్ అయిందని రాజశేఖర్ కామెంట్లు చేశారు.
జీవిత మాట్లాడుతూ ధృవ సినిమాలో అరవింద స్వామి పోషించిన పాత్రను రాజశేఖర్ కు ఇస్తే బాగుంటుందని సురేందర్ రెడ్డిని అడిగామని ఆయన అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. ప్రాధాన్యత ఉన్న విలన్ పాత్ర వస్తే రాజశేఖర్ నటించడానికి సిద్ధమేనని జీవిత తెలిపారు. ఇంట్లో జీవిత తుస్సుమని ఉంటుందని ఈవిడ ఫైర్ బ్రాండ్ ఏంటని అనుకుంటానని రాజశేఖర్ వెల్లడించారు.