సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు ఇప్పటివరకు 600 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు 700 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ అభిమానులకు దగ్గరవుతున్నారు. తాను కండక్టర్ గా పని చేసిన బస్ డిపోలో రజనీకాంత్ సందడి చేశారు.
రజనీకాంత్ కెరీర్ తొలినాళ్లలో బస్ కండక్టర్ గా పని చేశారనే సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో రజనీకాంత్ చిన్నచిన్న రోల్స్ లో చేయడంతో పాటు విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత హీరోగా అవకాశాలను అందుకున్న రజనీ ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్టార్ హీరోగా ఎదిగారు. తమిళనాడులో మొదట పాపులారిటీని పెంచుకున్న రజనీకాంత్ తర్వాత రోజుల్లో ఇతర భాషల్లో కూడా సత్తా చాటుతూ సక్సెస్ అయ్యారు.
తెలుగులో కూడా రజనీకాంత్ సినిమాలు డబ్ అయ్యి రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి. జైలర్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రజనీ తర్వాత సినిమాలతో కూడా వరుస విజయాలను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరికొన్ని సంవత్సరాల తర్వాత రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
రజనీకాంత్ పారితోషికం ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని సమాచారం అందుతోంది. జైలర్ సక్సెస్ తో రజనీకాంత్ రెమ్యునరేషన్ మరింత పెరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో రజనీ ఎలాంటి కథలను ఎంపిక చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఏడు పదుల వయస్సులో సైతం రజనీకాంత్ కష్టపడుతున్న తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.