ఈ ఏడాది వివిధ భాష చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇలా స్టార్ హీరోలు అందరూ కూడా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ ఏడాది ప్రేక్షకులను తమ దైన శైలిలో సందడి చేశారు. మరి ఈ ఏడాది మరొక రోజులో పూర్తికానుంది.
ఈ క్రమంలోనే ఈ ఏడాది హిట్ కొట్టినటువంటి సినిమాలు దర్శకులు ఫ్లాప్ అయినటువంటి సినిమాల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి హీరో గురించి కూడా ఒక వార్త వైరల్ గా మారింది. మరి ఈ ఏడాది ఏ హీరో అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయానికి వస్తే..
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా నిర్మాతకు భారీ స్థాయిలో లాభాలు కూడా వచ్చాయి. దీంతో ఈయన చిత్ర బృందానికి వివిధ రకాల కానుకలను అందజేశారు.
ఇలా ఈ సినిమా కోసం నిర్మాత (Rajinikanth) రజనీకాంత్ కి ఏకంగా 210 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తుంది. ఈ ఏడాది అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి హీరోగా ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచారు రజనీకాంత్ ఈయన తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తదుపరి ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది. ఈ ఇద్దరి తర్వాత షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్ కూడా అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి హీరోల జాబితాలో ఉన్నారు.