సినిమా షూటింగుల విషయంలో రజనీ కొత్త నిర్ణయం!
- August 10, 2020 / 09:15 PM ISTByFilmy Focus
కరోనా నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకొంటోంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలు కూడా షూటింగ్ కు రెడీ అవుతున్నారు. అయితే.. వీళ్ళందరికంటే సీనియర్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఇప్పుడప్పుడే షూటింగ్స్ వద్దు అంటున్నారట. పోన్లే కనీసం అక్టోబర్ లేదా నవంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకున్నారు ఆయనతో ప్రస్తుతం సినిమాను రూపొందిస్తున్న నిర్మాతలు. అయితే.. రజనీకాంత్ మరో ఆరు నెలల వరకు షూటింగ్ కి వచ్చేది లేదని తేల్చి చెప్పేసారు.
అంటే వచ్చే ఏడాది మార్చి వరకు ఆయన షూటింగ్ కు రానట్లే. ఆ లెక్కన శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అన్నాతే” సినిమా 2021లో విడుదల చేయడం కష్టమే. ఈ వార్త కేవలం శివ సినిమాకు మాత్రమే కాదు రజనీకాంత్ తదుపరి చిత్రాలను కూడా బాగా ఎఫెక్ట్ చేసింది. నిజానికి రజనీ 2022 ఎలక్షన్స్ లో పోటీ చేయకపోయినా అప్పటికి పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉండాలని ఫిక్స్ అయిపోయారు. ఈలోపు ఓ రెండు సినిమాలు చేసేయాలని నడుం బిగించి గ్యాప్ లేకుండా షూటింగ్స్ కూడా స్టార్ట్ చేశారు.

అయితే.. కరోనా వచ్చి రజనీ ప్లాన్ మొత్తం పాడు చేసింది. దాంతో రజనీని నమ్ముకున్న దర్సకనిర్మాతలే కాదు రజనీ ఫ్యాన్స్ కూడా కంగారుపడుతున్నారు. ఆల్రెడీ రజనీ వయసు 69 ఏళ్ళు. మహా అయితే ఆయన ఇంకో మూడు నాలుగేళ్లు మాత్రమే సినిమాలు తీయగలరు. ఈలోపు ఆయన 170 సినిమాల మార్క్ ను కంప్లీట్ చేయగలరా లేదా అని టెన్షన్ మొదలైంది.
Most Recommended Video
‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?













