లాస్ట్ ఇయర్ హ్యాట్రిక్ హిట్ అందుకున్న నాని, ప్రస్తుతం ‘కృష్ణార్జున యుద్ధం’ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడు. ‘భలే మంచిరోజు, శమంతకమణి’ సినిమాలతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న ఆయన, నాగ్ – నాని కాంబినేషన్లో మల్టీ స్టారర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నాని సరసన కథానాయికగా రకుల్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. వరుస హిట్స్ తో నాని జోరు మీద ఉండటంతో, ఆయనతో కలిసి నటించడానికి స్టార్ హీరోయిన్స్ ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ క్రమంలోనే నానితో చేయడానికి రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు.
త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు. ఈ సినిమాలో డాన్ గా నాగ్ .. డాక్టర్ గా నాని కనిపించనున్న సంగతి తెలిసిందే. అశ్వినిదత్ నిర్మించనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయ్యింది. మార్చి లేదా ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. 2018లో మోస్ట్ ఏవైటెడ్ ప్రొజెక్ట్ గా ఈ చిత్రం ఆల్రెడీ పేరు తెచ్చుకొంది.