స్టార్ హీరో రామ్ చరణ్ చాలా సంవత్సరాల క్రితం జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన విషయంలో కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బాలీవుడ్ కు దూరంగా ఉన్నారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ముందే పీఆర్ టీమ్ లు బలంగా ఉండేలా చరణ్ జాగ్రత్త పడుతున్నారు. బన్నీ, మహేష్ బాబులకు పీఆర్ టీమ్ లు బలంగా ఉండటంతో పాటు ఫ్యాన్స్ నుంచి బలమైన మద్దతు ఉంది. పవన్, ప్రభాస్ లకు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల సోషల్ మీడియాలో ఈ హీరోలపై ఎలాంటి ట్రోల్స్ వచ్చినా ధీటుగా ఈ హీరోల అభిమానుల నుంచి కౌంటర్లు వస్తున్నాయి.
ఎన్టీఆర్ కు కొన్నేళ్ల క్రితం వరకు పీఆర్ టీమ్ లు బలంగా ఉన్నా తారక్ ప్రస్తుతం వాటికి దూరంగా ఉంటున్నారు. ఎన్టీఆర్ కు మాస్ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. పీఆర్ టీమ్ ల ద్వారా సోషల్ మీడియాలో అనుకూలంగా వర్క్ చేసే అకౌంట్లు ఉండటం వల్ల హీరోలకు పాజిటివ్ ఇమేజ్ పెరుగుతోంది. రామ్ చరణ్ కూడా ఇలాంటి నెట్వర్క్ పై ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ లో సత్తా చాటాలని అనుకుంటుకున్నారు.
ట్రోల్స్ వచ్చినా సోషల్ మీడియాలో ట్రోల్స్ కు చెక్ పెట్టేలా బృందాలను రామ్ చరణ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కడం ఖాయమని చరణ్ బలంగా నమ్ముతున్నారు. రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాకు, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలతో పాటు కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాకు, సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాకు చరణ్ ఓకే చెప్పారని సమాచారం.