బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంటే చాలా చిన్నచూపు ఉండేది అని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మన హీరోలు దర్శకులు బాహుబలి కంటే ముందు వరకు అక్కడ సినిమాలు చేసిన ప్రతిసారి చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. ఆ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున కూడా ఉన్నారు. కానీ మన దర్శకుల ఆలోచనా విధానం హీరోల హార్డ్ వర్క్ మారిన తర్వాత నార్త్ ఆడియెన్స్ సినిమాలు చూసే విధానం కూడా ఒక్కసారిగా మారిపోయింది.
ఇదివరకే రామ్ చరణ్ 2013లో బాలీవుడ్ ఇండస్ట్రీలో జంజీర్ అనే ఒక సినిమాను రీమేక్ చేసిన విషయం తెలిసిందే. సీనియర్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ఆ పాత సినిమాని సాజిద్ నదియాద్వాల డైరెక్షన్ లో చేశాడు. అయితే ఆ మూవీతో రామ్ చరణ్ కోలుకోలేని దెబ్బ తిన్నాడు. ఆ దెబ్బతో మళ్లీ బాలీవుడ్ పై అడుగు పెట్టలేకపోయాడు. ఇక మొత్తానికి 9 ఏళ్ళ అనంతరం రాజమౌళి RRR స్టామినాతో మళ్ళీ నార్త్ లోనే విమర్శకులకు ఎదురుదెబ్బ గట్టిగానే కొట్టాడు.
RRR సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటించిన రామ్ చరణ్ నటనకు బాలీవుడ్ మీడియా ఫిదా అయ్యింది. అతని నటన ఆమోగం అంటూ ప్రత్యేకమైన కథనాలను హైలెట్ చేస్తోంది. ఇక మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో బాలీవుడ్ సినీ ప్రముఖులకు బాగా నచ్చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకే మనోడి టాలెంట్ గురించి అక్కడికి వారికి ఒక క్లారిటీ ఉంది. ఇక విమర్శలు చేసే వారికి ఇప్పుడు భీమ్ పాత్రతో ఎన్టీఆర్ విబేధాలు అడ్డుగోడలను బ్లాస్ట్ చేసి మరో క్లారిటి ఇచ్చేశాడు.
మొత్తానికి బాహుబలి సినిమా అనంతరం మన హీరోలు బాలీవుడ్ బడా హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ప్రభాస్ తరువాత మొన్న పుష్పతో బన్నీ క్లిక్కవ్వగా ఇప్పుడు మెగా నందమూరి హీరోలు రాజమౌళి అండతో గట్టిగానే నిలబడుతున్నారు. ఇక రాబోయే మహేష్ బాబు, రామ్ పోతినేని వంటి హీరోలు ఏ విధంగా క్లిక్కవుతారో చూడాలి.