రామ్ చరణ్ (Ram Charan) – సుకుమార్ (Sukumar) కాంబో అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగస్థలం (Rangasthalam) సినిమాతో హై రేంజ్ హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ మళ్లీ కలవబోతోంది. పుష్ప సిరీస్ తో సాలీడ్ హిట్ కొట్టిన సుకుమార్ రామ్ చరణ్‌తో RC17 సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారని ఇప్పటికే అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాలో చరణ్ ఓ డిఫరెంట్ పాత్ర చేయనున్నట్లు టాక్ ఉంది. ఇప్పటికే బన్నీతో (Allu Arjun) ఫుల్ మాస్ లెవెల్ సినిమాలు చేసిన సుక్కు, ఇప్పుడు చరణ్‌కి స్టైలిష్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నాడట.
మొదట్లో ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని టాక్ వచ్చినా, ఇప్పుడు సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని తాజా అప్‌డేట్. ఇందులో రామ్ చరణ్ ఒక్కడే కాదు.. మరో పాత్రలో కూడా సర్ ప్రైజ్ ఇస్తాడట. అంటే డ్యూయల్ రోల్ చేయనున్నాడని గాసిప్స్ బయటకొస్తున్నాయి. నాయక్ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించిన చరణ్ మళ్ళీ ఇన్నాళ్ళకు సుకుమార్ దర్శకత్వంలో డబుల్ బ్లాస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
సుకుమార్ గత సినిమాలను పరిశీలిస్తే, ప్రతి సినిమాలోనూ ఓ విభిన్నమైన థీమ్ ఉండడం కామన్. రంగస్థలంలో మట్టివాసన మేళవించిన కథను తీసుకొస్తే, నాన్నకు ప్రేమతోలో ఓ స్టైలిష్ రివెంజ్ డ్రామా అందించాడు. ఇక పుష్పతో (Pushpa) మరో రూట్‌లో వెళ్లాడు. ఈ నేపథ్యంలో RC17 కూడా చాలా స్పెషల్ కానుందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాపై రామ్ చరణ్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. తన కెరీర్‌లో మరొక క్లాసిక్ సినిమా అవ్వాలనే ఉద్దేశంతో, తానే డైరెక్ట్ చేసేలా సుక్కుతో డిస్కషన్ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు, చరణ్‌కు జాతీయ అవార్డు వస్తే సంతోషించేది తానేనని సుక్కు ఇప్పటి నుంచే ఫీలవుతున్నాడట. ఇప్పటివరకు వచ్చిన బజ్ ప్రకారం, ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. చరణ్ ప్రస్తుతం RC17 తో బిజీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్‌డేట్ రావచ్చని సమాచారం. సుకుమార్ మార్క్ మాస్ యాక్షన్‌తో, చరణ్ డ్యూయల్ రోల్ అయితే ఈ ప్రాజెక్ట్ భారీ రేంజ్‌లో ఉండబోతోందని చెప్పవచ్చు.