‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత రాంచరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. సాధారణంగా శంకర్ పనితనం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఓ సీన్ ను పది రోజులు తీస్తాడు అనే టాక్ ఉంది.
ఇక యాక్షన్ సన్నివేశాలు అయితే నెలలు తరబడి తీస్తూనే ఉంటాడు అనే టాక్ కూడా ఉంది. కానీ గేమ్ ఛేంజర్ కోసం తన పంధా మార్చుకున్నాడు. అది కూడా సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు వచ్చాక. ఇప్పుడు సీజన్ తో సంబంధం లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ.. శంకర్ మాత్రం గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆపడం లేదు. మే 1 వ తారీఖున కూడా షూటింగ్ ను ఆపలేదు. గేమ్ ఛేంజర్ కు.. ఇదే లాస్ట్ షెడ్యూల్.
శంకర్ ఇలా ఫాస్ట్ గా షూటింగ్ ను కంప్లీట్ చేయడం వెనుక రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. కాబట్టి.. నిర్మాత దిల్ రాజు సైడ్ నుండి కూడా ఒత్తిడి ఉంది. అలాగే మరోపక్క కమల్ హాసన్ తో చేస్తున్న ‘ఇండియన్ 2 ‘ షూటింగ్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. కాబట్టి శంకర్ లో ఈ మార్పు వచ్చింది.